Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Governor ESL Narasimhan about ‘Golden’ Telangana

By   /  March 12, 2018  /  Comments Off on Governor ESL Narasimhan about ‘Golden’ Telangana

    Print       Email

`బంగారు` తెలంగాణ‌

Suvidha
Biryani Pot

 

 

 

 

* రైతుల‌కు 24 గంట‌ల పాటు ఉచిత విద్యుత్‌

* మిష‌న్ భ‌గీర‌థ ద్వారా మంచినీరు

* పెరిగిన విద్యుత్ ఉత్ప‌త్తి

* 24 సంస్థ‌ల‌తో ఒప్పందాలు

* బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ప్రసంగం

డెక్క‌న్ అబ్రాడ్‌:  తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జాభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తోంద‌ని, బంగారు తెలంగాణ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంద‌ని తెలంగాణ రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అన్నారు. తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించారు.  పంటలకు నీరందేలా, రైతులు బాగుపడేలా వారికి గోదావరి, కృష్ణా జలాలను అందించేందుకు ప్రాజెక్టులు కడుతూ కృషి చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించే కార్యక్రమమూ జోరుగా సాగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. వ్యవసాయాధారిత రాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటును ఇస్తోందని చెప్పారు. 23 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందుతోందన్నారు. చేనేతలకు ఆసరాగా నిలిచేందుకు నేతన్నకు చేయూత అనే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు మంచి నీరందించే మహత్తర కార్యక్రమం వడివడిగా సాగుతోందని చెప్పుకొచ్చారు.

వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభం కాబోతోందని, అందుకోసం పరిశ్రమల ఏర్పాటుకు 24 సంస్థలతో ఒప్పందం కుదిరిందని వివరించారు. విద్యుదుత్పత్తి గణనీయంగా పెరిగిందని, పరిశ్రమలకు పవర్ హాలిడేలను ఎత్తేశామని చెప్పుకొచ్చారు. రవాణా రంగానికీ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పీపీపీ పద్ధతిలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశలో భాగంగా 30 కిలోమీటర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Birthday wishes to legend Ghantasala

Read More →