చీఫ్ జస్టీస్ జేఎస్ ఖేహార్ చర్యలకు కేంద్ర మద్దతు: ప్రధాని మోదీ
న్యాయ వ్యవస్థపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించాలన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ భావిస్తున్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మోదీ అలహాబాద్ హై కోర్టు 150వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జస్టీస్ ఖేహార్ మాటల్లో ఆవేదన కనిపిస్తోందని అన్నారు. ఇప్పటికే 1200 చట్టాలను తొలగించామని చెప్పారు. తమ ప్రభుత్వం న్యాయవ్యవస్థను ఆధునికీకరించేందుకు సహాయం చేస్తోందని అన్నారు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు స్టార్టప్ కంపెనీలను ప్రారంభించాలన్న ఉత్సాహం ఉన్నవారు మంచి ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు.
కోర్టుల కార్యకలాపాలను సరళతరం చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించేందుకు జస్టీస్ ఖేహార్ చేపట్టిన చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. న్యాయవ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. సమయం వృథాకాకుండా ఉండేందుకు సాక్షుల విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ను ఉపయోగించాలి సూచించారు. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకునే సమయానికి భారత్ ను సరికొత్త శిఖరాలు అధిరోహించేలా న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, ప్రజలు పాటుపడాలని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.