73 ఛానళ్లపై వేటు!
కేంద్రం మీడియాపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో అలాంటి ఛానళ్లు, పేపర్లు, రేడియో ఛానళ్లపై చర్యలు తీసుకుంది. రూల్స్ ను బ్రేక్ చేసే మీడియా సంస్థల లైసెన్స్ లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాల్ని తీసుకుంది. ఇలా వేటు పడిన టీవీ ఛానళ్లు.. ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు.. వార్తా పత్రికలు ఒకటో రెండో కాకుండా పెద్ద ఎత్తున ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో వేటు పడిన మీడియా సంస్థల వివరాల్ని కేంద్ర సహాయమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ రాజ్యసభలో ప్రకటించారు.రూల్స్ ను బ్రేక్ చేస్తున్న మీడియా సంస్థలపై వేటు వేసిన వివరాల్ని కేంద్రమంత్రి ప్రకటిస్తూ.. మొత్తంగా 73 టీవీ ఛానళ్లు.. 24 ఎఫ్ఎం రేడియో ఛానళ్లు.. 9 వార్తా పత్రికల లైసెన్స్ లను రద్దు చేసినట్లుగా వెల్లడించారు.
అదే సమయంలో 1867 నాటి పీఆర్ బీ చట్టాన్ని ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ బుక్స్ అండ్ పబ్లికేషన్ గా మార్చినట్లుగా ప్రకటించారు. వేటు వేసే విషయంలో ఎంత కఠినంగా ఉందో.. కొత్త వాటికి లైసెన్స్ ల జారీలోనూ కేంద్రం జోరును ప్రదర్శిస్తోంది. ఇటీవల అనుమతి మంజూరు చేసిన ప్రైవేటు ఛానళ్లను చూస్తే.. 42 కొత్త వాటికి అనుమతి ఇవ్వటంతో పాటు.. 196 కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అనుమతిచ్చినట్లుగా వెల్లడించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దేశంలో రిజిష్టర్డ్ ప్రైవేటు శాటిలైట్ టీవీ ఛానల్స్ మొత్తం 892 ఉన్నట్లు వెల్లడించారు. టీవీ ఛానళ్ల జోరు దేశంలో ఏ స్థాయిలో ఉందనేది చెప్పకనే చెప్పినట్లైంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.