Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Great if I and Shikhar can match Tendulkar-Ganguly pair

By   /  February 5, 2016  /  Comments Off on Great if I and Shikhar can match Tendulkar-Ganguly pair

    Print       Email

rohith sharma1దిగ్గజాలతో పోల్చడం గొప్పగా ఉంది..!
ఒకప్పటి టీమిండియా సూపర్బ్ ఓపెనింగ్ జోడీ సచిన్-సౌరవ్ గంగూలీతో శిఖర్ థావన్ ని.. తనను పోల్చడం చాలా గొప్పగా ఉందని ప్రస్తుత ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయ పడుతున్నారు. నిజానికి వారిని అందుకోవాలంటే తాము సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. అత్యంత విజయవంతమైన జోడీతో తమను పోల్చడం చాలా సంతృప్తిని ఇస్తోందని అన్నారు. వాళ్ళిద్దరూ సాధించిన విజయాలను.. తాము సాధించాలంటే ఎంతో శ్రమించాలన్నా,రు. ఒకవేళ ఆ విజయాలు తాము అందుకుంటే చాలా గొప్పగా భావిస్తానని తెలిపారు.ప్రస్తుతం మేము వారికి దగ్గరలో లేమన్నారు. తాము చేయాల్సిందల్లా.. భారత్ కు సాధ్యమైనన్ని విజయాలు తెచ్చిపెట్టడేమనని వినమ్రంగా చెప్పారు.

ఆసీస్ టూర్ లో థావన్, రోహిత్ బాగా రాణించారు. టీమిండియా వన్డే సీరిస్ ను కోల్పోయినా రోహిత్ మాత్రం మ్యాన్ ఆఫ్ ద సీరిస్ గా నిలిచారు. అయితే ఇప్పటికీ తాను భారీ స్కోర్లు చేయాలని భావిస్తున్నానని అంటున్నారు. ప్రస్తుతం తాను సాధించింది గొప్ప విషయం కాదని.. మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉందని.. నాకు నేను చెప్పుకుంటూ ఉంటానని అంటున్నారు.తాను ఆసీస్ పై 441 పరుగులు చేశానని.. అయితే తర్వాతి సీరిస్ లో మరింతగా టార్గెట్ పెట్టుకుంటానని తెలిపారు. అది కూడా సాధించగలిగితే.. సంతృప్తి మాత్రం పడనన్నారు.అలా సంతృప్తి పడితే తర్వాత మెరుగైన ప్రదర్శన చేయలేనని రోహిత్ శర్మ చెబుతున్నారు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →