కొందరిలో ఆశ.. మరికొందరిలో నిరాశ
కేసీఆర్ జపం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నమంత్రులపై చర్యలు తీసుకునే అవకాశం
మహిళలకు ఈసారి చోటు దక్కే అవకాశం
దుర్ముఖినామ సంవత్సరం ఉగాది సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన మంత్రి వర్గ మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ రోజో.. రేపో గవర్నర్ నరసింహన్ కలవనున్నారని తెలుస్తోంది. అయితే తెలంగాణ పార్టీలో చాలా మంది తమకు ఈసారైనా మంత్రి పదవులు వస్తాయని ఆశపడుతుడగా.. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరు ఆందోళనలు ఉన్నారు. అయితే కొందరి శాఖలను మార్చుతారని, సీఎం కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
ఆందోళన అంతా ఆ ఇద్దరిదే…
దుర్ముఖినామ సంవత్సర పంచాంగ పఠనంలో పండితుడు బాచంపల్లి సంతోష్‌కుమార్ విద్య, వైద్య శాఖల్లో అవినీతి పెచ్చరిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పంచాంగ పఠనంలో చెప్పడంతో అక్కడే ఉన్న ఆ శాఖల మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి నివ్వెరపోయారట. అంతే అప్పటి నుంచి వారిలో దడ మొదలైంది. వాళ్ల శాఖల్లో ఏమైనా మార్పు ఉంటుందో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సింది.
ఈసారైనా మహిళలకు చోటు దక్కేనా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరు. కనీసం ఈసారైనా మంత్రులకు చోటు దక్కుతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. సీనియర్లు, బాగా పనిచేస్తున్న మహిళలను ఈసారి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.