Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై…

By   /  May 2, 2016  /  Comments Off on కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై…

    Print       Email
Gulebakavali_katha
గులేబకావళి కథ(1962),సంగీతం–జోసెఫ్-కృష్ణమూర్తి

గానం– : ఘంటసాల, జానకి

రచన- : సి.నా.రె
*********
విశేషాలు–గులేబకావళి కథ 1962 సంవత్సరంలో విడుదలైన జానపద తెలుగు సినిమా.ఈ సినిమాకు సంగీత దర్శకత్వం జోసెఫ్ కృష్ణమూర్తి వహించగా, పాటలన్నీ సి.నారాయణ రెడ్డి రాశారు. జోసెఫ్ కృష్ణమూర్తికి సంగీత దర్శకునిగానూ, సినారెకు గేయ రచయితగానూ ఇదే తొలిచిత్రం.ఈ చిత్ర కథను మూకీ చిత్రంగా ఒకసారి (1924), హిందీలో రెండు సార్లు (1932, 1963), తమిళంలో రెండు సార్లు (1935 1955), పంజాబీలో ఒకసారి (1939) మరియు తెలుగులో రెండు సార్లు (1938, 1962) లో నిర్మించారు.
*************
 
కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై…
ఎగసి పోదునో చెలియా…నీవే ఇక నేనై…
జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు
తడిసి తడియని కొంగున…ఒడలు దాచుకున్నందుకు
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము…మరులు గొలుపుతున్నందుకు
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికానిని… జంట గూడి రమ్మన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము…బిగి కౌగిట కలదన్నది
కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై…
ఎగసి పోదునో చెలియా…నీవే ఇక నేనై…కలల అలల పై..
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?feature=player_detailpage&v=Ahe6KbiT-rw వినండి !
టీవీయస్. శాస్త్రి 
TVS SASTRY 
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →