కతర్ లో అల్ అలీ ప్రాజెక్ట్స్ క్యాంపు లో నిర్వహించిన గణేష్ మండపానికి విశేష స్పందన వచ్చింది. ప్రవాస తెలంగాణా కార్మిక సంఘం ప్రెసిడెంట్ శ్రీ గుగ్గిళ్ళ రవి గౌడ్ గారి అధ్వర్యంలో అల అలీ ప్రాజెక్ట్స్ వారి క్యాంపు లో గత నాలుగేళ్ళుగా గణేష్ మండపాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగ లంగాణా ఎన్నారై ఫోరం (TeNF ) ఫోరం గల్ఫ్ శాఖ అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ అబ్బాగౌని గారు గణ నాదునికి ప్రత్యెక పూజలు జరిపారు.
తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF ) మరియు తెలంగాణ ప్రజా సమితి , తెలంగాణా గల్ఫ్ సమితి సంయుక్తంగ నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి సుమారు 1500 హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయ వంతగా నిర్వహించడానికి విశేష కృషి చేసినటువంటి యమ్. మహిపాల్ , ఎస్ శంకర్ గౌడ్,తిరుపతి , ఎమ్ కిరణ్ , ఎమ్ మధు , వి శ్రీనివాస్ గౌడ్ , బీ శ్రీకాంత్, ఎస్ మల్లయ్య , కిషన్ , నర్సింహులు , అశోక్, సత్య, అన్వేష్ గౌడ్ మరియు ఇతర ప్రతినుదులని ఈ సందర్భంగ అభినందిచారు. అనంతరం జరిగిన ధూమ్ ధాం అధిక సంఖ్యలో తెలంగాణ కార్మిక సోదరులు పాల్గొని తమ ఆట పాట లతో అలరించారు. అనంతరం షమల్ బీచ్ లోగణ నాదుకి నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.