Loading...
You are here:  Home  >  Politics  >  Delhi Politics  >  Current Article

Hafiz Saeed behind JNU agitation, says Rajnath Singh ..

By   /  February 15, 2016  /  Comments Off on Hafiz Saeed behind JNU agitation, says Rajnath Singh ..

    Print       Email

jnu-fake-hafiz-saeed-tweet1జేఎన్ యూ ఘర్షణల వెనుక హఫీజ్ సయీద్ హస్తం..

జేఎన్ యూ ఘర్షణల వెనుక లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.ఈ నిజాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు.అయితే రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాల్సిందేనని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.పాక్ కు మద్దతుగా నిలుస్తున్న జేఎన్ యూ విద్యార్ధి సోదరులకు మద్దతు ఇవ్వాల్సింది గా మన పాక్ సోదరులను కోరుతున్నానని హఫీజ్ సయీద్ ట్వీట్ చేసినట్లు వచ్చిన కథనాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి మీడియాతో మాట్లాడారు.

InCorpTaxAct
Suvidha

జేఎన్ యూలో ఆఫ్జల్ గురు వర్ధంతి నిర్వహించడం విచారించతగ్గ విషయమని అన్నారు. ‘ దేశ సార్వభౌమాధికారం, సమగ్రత ప్రశ్నార్థకమయ్యే చర్యలకు పాల్పడరాదు. ఇలాంటి సందర్భాల్లో దేశమంతా ముక్తకంఠంతో నినదించాలి. పార్టీలు కూడా దీన్ని రాజకీయ లబ్ధి కోణం లో చూడరాదని విజ్ఞప్తి చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. అయితే, విద్యార్థులపై రాజ్‌నాథ్‌ మోపిన తీవ్ర అభియోగానికి ఆధారాలు చూపాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆందోళన అణచివేతకు సయీద్‌ను అడ్డుపెట్టుకోవడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం మరోసారి నైతిక పతనాన్ని చాటుకుందని విమర్శించారు. సీపీఐ నేత డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ కూడా ఇదే డిమాండ్‌ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →