Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Hafiz Saeed’s son incites crowd to wage war against India, endorses Burhan Wani, Dawood Ibrahim

By   /  March 4, 2017  /  Comments Off on Hafiz Saeed’s son incites crowd to wage war against India, endorses Burhan Wani, Dawood Ibrahim

    Print       Email

dawood ibraheem Hafeez saeedదావూద్ తో జేయూడీ సంస్థకు సంబంధాలు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ముంబై పేలుళ్ళ సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ అండదండలు ఉన్నాయని పలుమార్లు భారత్ వాదించింది. దీనికి సంబంధించి చాలా సాక్ష్యాలు కూడా చూపించింది. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. ఈ మధ్య జమాత్-ఉల్-దవా చీఫ్ మిలిటెంట్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హాకి సంబంధించిన వీడియో ఒకటి బహిర్గతమైంది. ఇదికాస్తా నేషనల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

ఫిబ్రవరి 5న పాక్ లో నిర్వహించిన కాశ్మీర్ డే సందర్భంగా ఓ బహరింగ సభ జరిగింది. ఇందులో జేయూడీ చీఫ్ తల్హా పాల్గొన్నాడు. అంతేకాకుండా తన ప్రసంగంలో భాగంగా అతను దావూద్ ఇబ్రహీం పేరు చెప్పాడు. అతని పేరును ఉచ్ఛరిస్తూ భారత్ పై యుద్ధం చేయాలని స్థానికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బయటపెట్టింది. ఇక తల్హా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బాటుగా నినాదాలు చేసినట్లుగా వీడియోను బట్టి తెలిసిందని పేర్కొంది.

‘మీరు న్యాయమూర్తులు, డాక్టర్లు , పోలీసులు అవుతారా..?’ అంటూ తల్హా ప్రశ్నిస్తాడు. అయితే అక్కడి జనాలు లేదు లేదు అంటూ సమాధానం చెప్పడం వినిపిస్తుంది. దీంతో మళ్లీ అతను ‘మీరంతా దావూద్ ఇబ్రహీంలు అవుతారా..?’ అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి అందరూ అవును అంటూ నినాదాలు చేసినట్లుగా వినిపిస్తుంది. అలాగే ఇండియన్ ఆర్మీ ఎన్ కౌంటర్ లో మరణించిన బుర్హాన్ వనీ పేరును కూడా ప్రస్తావించాడు.అయితే ఈ వీడియోపై భారత్ నిఘా వర్గాలు దృష్టిసారించాయి. ఈ వీడియో నిజమో కాదో తేల్చుకునే పనిలో పడ్డాయి. అలాగే దావూద్ తో కలిసి ఈ ఉగ్రవాద సంస్థ పనిచేస్తోందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →