Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Happy Birthday Balaiah

By   /  June 10, 2016  /  Comments Off on Happy Birthday Balaiah

    Print       Email

IndianClicks_GPSK_Movie_Gulte_1000x600_06092016_2హ్యాపీ బ‌ర్త్‌డే బాల‌య్య‌!

 

InCorpTaxAct
Suvidha

నంద‌మూరి బాల‌కృష్ణ అటు సినిమా రంగంలోనూ.. రాజ‌కీయాల్లోనూ రాణిస్తున్న నాయ‌కుడు. నేటితో 56వ ఏట అడుగుపెట్ట‌బోతున్నాడు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ గురించి కొన్ని విష‌యాలు… బాల‌కృష్ణ‌.. నటనాపరంగానే కాకుండా, తండ్రి ఆలోచనలకు, ఆవేశానికీ కూడా ఆయన వారసుడే. సాటి హీరోలు సాంఘిక చిత్రాలకే పరిమితమైన తరుణంలో తండ్రి చూపిన బాటలో పయనించి జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో కూడా బాలకృష్ణ శభాష్‌ అనిపించుకొన్నారు. నాలుగు పదులు దాటిన నటప్రస్థానంలో అలుపెరుగకుండా, ఎక్కడా గ్యాప్‌ లేకుండా నటిస్తూ, సంచలన విజయాలతో చరిత్ర సృష్టిస్తూ అజేయంగా ముందుకు సాగుతున్నారు బాలకృష్ణ. 56వ ఏట అడుగెడుతున్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకుడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పకుడు. కాగా బాల‌య్య‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘హ్యాపీ బర్త్‌డే బసవరామతారకపుత్ర’ అంటూ క్రిష్ ‘శాతకర్ణి’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇటీవల మొరాకోలో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాల్లోని స్టిల్‌నే ఫస్ట్‌లుక్ పోస్టర్‌గా విడుదల చేశారు. ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో నాయికగా నటించనున్న శ్రేయ కూడా పాల్గోనుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →