Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Happy Birthday to Brahmanandam

By   /  February 1, 2016  /  Comments Off on Happy Birthday to Brahmanandam

    Print       Email

Brahmanandam Birthdayహస్య బ్రహ్మకు ప్రముఖుల బర్త్ డే విషెస్..
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సోమవారం తన పుట్టినరోజు జరుపుకున్నారు.బ్రహ్మీ పేరు చెప్పగానే ఆయన చేసిన పాత్రలు ఠక్కున గుర్తుకొస్తాయి.ఇండస్ట్రీలోకి చాలామంది కమెడియన్ ఎంటర్ అయినా ఆయనకు మాత్రం పోటీయే లేదు.ఏకంగా కొన్ని సినిమాలు అయితే కేవలం ఆయన నటన మీద బేస్ అయి నడచిన సందర్భాలున్నాయి.ఆయన తెరమీద కనిపించగానే ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ హస్య బ్రహ్మ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

InCorpTaxAct
Suvidha

తన లాంటి వారికి ఎందరికో స్ఫూర్తి: ఆలి

 

తన లాంటి నటులకు బ్రహ్మానందం స్ఫూర్తి అని కమెడియన్ ఆలీ అన్నారు.‘అహనా పెళ్లంట’ సినిమాలో అరగుండుతో మొదలుకొని ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్రంలో గచ్చిబౌలి దివాకర్‌ వరకు ఏ పాత్రలో అయినా బ్రహ్మానందం ఇట్టే ఒదిగిపోగలడన్నారు.

బ్రహ్మీ నవ్వుకు చిరునామా : తాగుబోతు రమేశ్‌
టాలీవుడ్ లో నవ్వుకు చిరునామా బ్రహ్మానందం.ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ నటుడు తాగుబోతు రమేశ్‌ తన ఫేస్‌బుక్‌ లో పోస్ట్‌ చేశారు.

బ్రహ్మీ పేరు చెప్పగానే నవ్వొస్తుంది: చెర్రీ

బ్రహ్మానందం పేరు చెప్పగానే నవ్వొస్తుందని .. ఆయన ఎప్పటికీ నవ్వుతూ.. నవ్విస్తూ.. ఉండాలంటూ రామ్‌ చరణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

బ్రహ్మనందంను వరించిన పురస్కారాలు

బ్రహ్మానందంకు సినిమా రంగంలో చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దాదాపు వేయికి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఆయన స్థానం సంపాదించారు.బ్రహ్మానందంకు గౌరవ డాక్టరేట్‌ కూడా లభించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →