ఓ ప్రియమైన స్నేహితుడా ! (గీతం)
రచన : డా.ఆచార్య ఫణీంద్ర
నీ హృదయంలో నా స్వప్నాలు
నెలకొని ఉన్నాయి –
నా హృదయంలో నీ భావాలు
బలపడి ఉన్నాయి –
కళ్ళు నాలుగైనా, చూసే
దృశ్యమొకటేలే !
కాళ్ళు నాలుగైనా, చేరే
గమ్యమొకటేలే !
ఓ ప్రియమైన స్నేహితుడా !
నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన ||
పై పై మెరుగుల బహుమతి కాదు
స్నేహమంటే –
అవసర పూర్తి సాయం కాదు
స్నేహమంటే –
ఒకరి కోసం ఒకరు గడిపే
జీవనం – స్నేహం !
ఒకరి కోసం ఒకరు చేసే
భావనం – స్నేహం !
ఓ ప్రియమైన స్నేహితుడా !
నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన ||
చేయి, చేయి కలిపి తిరిగితే
స్నేహమైపోదు –
మాట, మాట కలిపి నవ్వితే
స్నేహమైపోదు –
ఒకరి సౌఖ్యం కోసం ఒకరు
కష్ట పడుటే స్నేహం !
ఒకరి కష్టం ఒకరు చేకొని
సుఖం పంచుట స్నేహం !
ఓ ప్రియమైన స్నేహితుడా !
నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన ||
( స్నేహమయ జీవనులందరికీ ” మైత్రీ దినోత్సవ ” సందర్భంగా
హార్దిక శుభాభినందనలతో … )
— *** —
Author:
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.