మాతృ దేవో భవ.. అంటే తల్లి దైవంతో సమానం.. భారతీయ సమాజం, కుటుంబ వ్యవస్థలో తల్లికి విశిష్ట స్థానం ఉంది.. మనకు జన్మనిచ్చి, పెంచిన తల్లికి జీవితాంతం సేవ చేసినా ఋణం తీరదు.. కుటుంబంలో భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులూ భాగమే.. వారు మనకు భారం కాదు.. వారిని కాపాడుకోవడం మన బాధ్యత..
విదేశీయులకు తల్లిదండ్రుల విషయంలో పెద్దగా సెంటిమెంట్ లేదు.. పిల్లలు వయసు పెరిగి సంపాదన మొదలు కాగానే పేరెంట్స్ భారంగా కనిపిస్తారు.. వారిని వృద్ధాశ్రమాని పంపి ‘భారం’ వదిలించుకుంటారు.. అయితే వారికి ‘అప్పుడప్పుడు’ తల్లిదండ్రులు గుర్తుకొస్తారు.. ఎంతైనా వారూ మనుషులే కదా.. ఇందుకోసం వారు.. మదర్స్ డే, ఫాదర్స్ డే.. అంటూ కొన్ని ‘దినాలు’ పెట్టుకున్నారు.. ఆ రోజున వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి గ్రీటింగ్స్ చెప్పి, బహుమతులు ఇచ్చి, కొంతసేపు గడిపి వస్తారు..
తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవడానికి ఒక రోజు మాత్రమే చాలా?.. మిగతా రోజులు పట్టించుకొనక్కరలేదా?.. మరి మనకెందుకు ఈ దినాలు?.. మనకు ప్రతిరోజూ తల్లిదండ్రులు పూజనీయులే..
భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం.. ఇంత గొప్ప సంస్కృతి ఉన్న మనం విదేశాల నుండి పనికిమాలిన, కపట ప్రేమ, వ్యాపార దృక్పద దినాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?.. ఆలోచించండి..
Source: Kranti Dev Mitra
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.