Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

I made a mistake, Harbhajan Singh

By   /  July 4, 2016  /  Comments Off on I made a mistake, Harbhajan Singh

    Print       Email

Harbhajan Singhనేను చేసింది పెద్ద త‌ప్పే!

 

InCorpTaxAct
Suvidha

 

 

టీమిండియా ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ కు కొంచెం కోప‌మెక్కువ‌నే చెప్పాలి. ఆ క్ష‌ణంలో త‌న‌కు ఏద‌నిపిస్తే అది చేస్తుంటాడు. అందుకే కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంటుంటాడు. అలాంటి వివాదాల్లో ఒక‌టి మాజీ క్రికెట‌ర్ శ్రీ‌శాంత్‌ను చెంప‌పై కొట్ట‌డం. దీనిపై హ‌ర్భ‌జ‌న్ తాజాగా స్పందించారు.   2008లో మొదటి ఐపిఎల్ సీజన్ జరుగుతున్నప్పుడు మైదానంలోనే శ్రీశాంత్‌ చెంపపై హర్భజన్ కొట్టిన సంగ‌తిని గుర్తు చేసుకుంటూ అప్పడు శ్రీశాంత్ నాటకమాడాడని, డ్రామా చేశాడని అంటూనే మైదానంలో అలా చేయి చేసుకోవడం తన తప్పేనని ఒప్పుకున్నాడు. తాను ఇప్పటికీ ఆ విషయం పట్ల సిగ్గు పడుతున్నట్టు తెలిపాడు. తన జీవితంలో చేసిన పెద్ద తప్పుగా తాను భావిస్తున్నానని అంతకుముందు కూడా పలుసార్లు చెప్పినట్టు గుర్తుచేశాడు.

అయితే ఆ స‌మ‌యంలో తాను ముంబాయ్ ఇండియ‌న్స్ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్నాన‌ని, శ్రీ‌శాంత్ కింగ్స్ లెవ‌న్ పంజాబ్ త‌ర‌పున ఆడుతున్నాడ‌ని పేర్కొన్నాడు. కాగా కొన్ని ఆవేశంలో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగిపోతాయ‌ని, అయితే ఆ త‌ప్పులు జీవిత‌మంతా వెంటాడుతూనే ఉంటాయ‌ని, తాను చేసింది కూడా అలాంటి త‌ప్పేన‌న్నారు. ఏదేమైనా హ‌ర్భ‌న్ త‌ప్పు ఒప్పుకోవ‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →