Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Harish Rao Clarifies Mid Manair Dam Status

By   /  January 7, 2018  /  No Comments

    Print       Email

మిడ్ మానేరు పనులన్నీ ఫిబ్రవరి 15 లోగా పూర్తి : మంత్రి హరీశ్ రావు

 

Suvidha
Biryani Pot

 

 

మిడ్ మానేరు ప్రాజెక్టు గేట్ల బిగింపు సహా అన్ని సివిల్, మెకానికల్, సాంకేతిక పనులన్నీ వచ్చే నెల (ఫిబ్రవరి) 15 లోపు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కాళేశ్వరం పనుల పురోగతి, పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్న చనఖా కొరాటా ఆనకట్ట పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. మిడ్‌ మానేరు పనులు త్వరగా పూర్తి చేయడం కీలకమన్నారు. భూ పరిహారం కోసం తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు అఫిడవిట్లు జారీ చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న మంత్రి.. నిర్వాసితుల పునరావాస చర్యలు వేగవంతం చేయాలన్నారు.

ప్రతి గ్రామంలోనూ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి నిర్ధారించాలని చెప్పారు. ముంపునకు గురయ్యే నిర్మాణాల అంచనాలు రూపొందించడంలో అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిడ్ మానేరు స్పీల్ వే పనుల పురోగతిని మంత్రి హరీశ్ రావు తెలుసుకున్నారు. మొత్తం 25 గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు, బిగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. రివిట్మెంట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్టు ఏజెన్సీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని ఆర్ అండ్ ఆర్ పనులను వేగవంతం చేయాలని హరీశ్ రావు ఆదేశించారు.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Anasuya reveals her marriage secret

Read More →