Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Harish Rao counters Jagan

By   /  May 17, 2016  /  Comments Off on Harish Rao counters Jagan

    Print       Email

Harish Rao 1మానుకోట గుర్తు చేసుకో జ‌గ‌న్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ తెలంగాణ ప్ర‌భుత్వం అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతోంద‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించిన నేప‌థ్యంలో తెలంగాణ నీటి పారుద‌ల శాఖ మంత్రి హ‌రీష్‌రావు కూడా అదే స్థాయిలో వైయ‌స్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించారు. గ‌తాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు. గతంలో మీ తండ్రి రాయలసీమకు నీళ్లు మళ్లించి తెలంగాణకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను అడ్డుకొని తెలంగాణ రైతుల ఉసురుపోసుకోవద్దన్నారు. చంద్రబాబు, జగన్ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటుంటే ఏపీ మాత్రం సమస్యలను జఠిలం చేస్తున్నదిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అస‌లు జ‌గ‌న్  తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేయడం చాలా హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే మరోసారి మానుకోట ఘటన పునరావృతమైతదని జగన్‌ను హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడుకునేందుకు స్వయంగా పిలిచినా ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ స్పందించలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి అక్ర‌మ ప్రాజెక్టుల‌ను క‌ట్ట‌డం లేద‌ని, అలాంటి దుస్థితి త‌మ‌కు ప‌ట్ట‌లేద‌న్నారు. ఏదైనా రైట్ రాయ‌ల్‌గా ప‌నిచేసుకుంటూ ముందుకు పోతామ‌ని పేర్కొన్నాయి. కాగా ఇక్క‌డో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఏపీ స‌ర్కార్ క‌ట్టే ప్రాజెక్టులు స‌క్ర‌మైన‌వేనా అని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →