ఎండుతున్న `ఆకుపచ్చ`

????????????????????????????????????
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన `హరిత హారం` కారక్రమం మసకబారుతోందా? మొక్కలు నాటేసి పని అయిపోయిందని సర్కార్ అనుకుంటోందా? మొక్కల సంరక్షణ చర్యలు గాలికొదిలేసిందా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ప్రజలు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి వద్ద మొక్క నాటి హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అదే సమయంలో నల్లగొండ జిల్లా పరిధిలోని తూప్రాన్‌పేట నుండి కోదాడ మండలం నల్లబండ వరకు 153 కిలోమీటర్ల మేరకు రికార్డు స్థాయిలో ఒకేరోజు 87 వేల మొక్కలు నాటారు. ప్రజలు విద్యార్థులు ప్రభుత్వ శాఖల సిబ్బంది – మహిళా సంఘాలు – అంగన్ వాడీలు – స్వచ్ఛంద సంస్థల సభ్యులంతా పోటీలు పడి మరీ మొక్కలు నాటారు. అయితే నాటిన మొక్కలకు నీరు పోసే దిక్కులేక అవి ఎండిపోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ-జాతీయ రహదారి వెంట ఎక్కడ చూసినా ఎండిన మొక్కలే దర్శనమిస్తున్నాయి.
ఇలాగైతే జాతీయ రహదారికి హరితహారం సొగసుల సంగతేమోగాని నర్సరీల్లో మొక్కలు పెంచి నాటేందుకు చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అయినట్లేనంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. హరితహారం ప్రారంభం రోజున అధికారులు మాట్లాడుతూ జాతీయ రహదారి వెంట హరితహారం మొక్కల సంరక్షణకు పర్యవేక్షణాధికారులను నియమిస్తామని, రోడ్డు వెంట వారి సెల్‌ఫోన్ నెంబర్లు రాయిస్తామన్నారు. ఈ దిశగా నేటికీ చర్యలు తీసుకోకపోగా వర్షాలు లేక నాటిన మొక్కలు ఇప్పటికే వేలల్లో చనిపోయాయి. మొత్తంగా హరితహారం అంటే ఎండిన మొక్కల సమాహారం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.