ఏపీలో నన్ను హత్య చేస్తారేమో.. అనుమానం వ్యక్తం చేసిన మందకృష్ణ మాదిగ..
ఏపీ ప్రభుత్వంపై మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తనకు ఏపీలో రక్షణ లేదని ఆరోపించారు. తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తాను వెళ్లిన ప్రాంతాలకు కొన్ని కార్లు కూడా వెంబడిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వరంగల్ లో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తాము అన్ని రాష్ట్రాల్లోనూ స్వేచ్ఛగా తిరుగుతున్నానని చెప్పారు. కాని ఏపీలో మాత్రం చంద్రబాబు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. తనను వెంబడిస్తున్న వారి వివరాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా తెలుసునని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా తనను ఎవరూ వెంబడించలేరని అన్నారు.తక్షణం సదరు నిందులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. తాను రెండు రాష్ట్రాల సీఎంలతో కలసి పని చేశానని అన్నారు. వర్గీకరణ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట తప్పారని ఆరోపించారు. తక్షణం చంద్రబాబు తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. లేదంటే తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.