మంత్రుల అవినీతిపై సీఎం ఆరా!
సుధీర్ఘకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని పక్కన పెట్టి ఆస్థులను కూడబెట్టుకోవడంలో నిమగ్నమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొందరి ఆస్థులను చూస్తే మాత్రం అది నిజమేననిపిస్తోంది. అధికారంలోకి రెండేళ్లు అయినా కాక ముందు తెలుగుదేశానికి చెందిన కొంతమంది మంత్రులు వందల కోట్లు సంపాధించారని, వాళ్ల శాఖల్లో కూడా అవినీతి పెరిగిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంత్రుల అవినీతిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు వాళ్ల ఆస్థులుఎన్ని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించారు అనే సమాచారాన్ని బాబు వేగుల ద్వారా తెప్పించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మంత్రుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ సమాచారం చేరిపోయింది. అధికారుల నుంచి వస్తున్న సమాధానమే వారికి పరోక్ష హెచ్చరికలుగా మారాయి.
కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంత మంది మంత్రులు మంత్రివర్గ విస్తరణలో ఉద్వాసన తప్పదనే ఆందోళనలో ఉన్నారు. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా తమ ఆవేదనను, వివరణను ఆయనకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగంగానే బాబును విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టామని, అది అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోకపోతే మళ్లీ ఎన్నికల్లో ఎలా ఖర్చుపెట్టాలని ప్రశ్నిస్తున్నారు. తాము కోట్లు సంపాదించుకుంటే తమ అధినేత లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారని, తాము చేసేది తప్పు అయితే తమ అధినేత చేసేది కూడా తప్పేనని చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా అధినేతపైనే ఆరోపణలు వస్తున్నప్పుడు మంత్రులపై ఎలా చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.