Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Heavy Rains Lash Hyderabad..

By   /  August 10, 2017  /  Comments Off on Heavy Rains Lash Hyderabad..

    Print       Email

హైదరాబాద్ లో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం..

 

InCorpTaxAct
Suvidha

 

 

హైదరబాద్ మహా నగరంలో బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీనగర్‌లో 5.4, ఆస్మాన్‌గడ్‌లో 4.8, నారాయణగూడలో 4.6 సెం.మీల వర్షం పాతం నమోదైంది. అలాగే నాంపల్లిలో 4.2, ఆసిఫ్‌నగర్‌లో 4.2 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

హబ్సిగూడ, మోండా మార్కెట్‌, పార్శీగుట్ట, వారాసిగూడ, చిలకలగూడ, పద్మారావునగర్‌, మారేడ్‌పల్లి, బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, హిమయత్‌నగర్‌, నారాయణగూడ, నాచారం, మల్లాపూర్‌, తార్నాక, లాలాపేట్‌, ఓయూ క్యాంపస్‌, అల్వాల్‌, బొల్లారం, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, రామాంతపూర్‌, ఉతప్పల్‌, బోడుప్పల్‌, ఘట్‌కేసర, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, కాప్రా, మల్లాపూర్‌, నాచారం, హెచ్‌బీ కాలనీల్లోకి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్లపై చేరిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. నగరంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. వర్షపు నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →