Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Heavy snowstorm in USA..

By   /  March 15, 2017  /  Comments Off on Heavy snowstorm in USA..

    Print       Email

snowstorm inn usఅమెరికాను వణికిస్తున్న భారీ మంచు తుపాను..

అమెరికాలో భారీగా మంచు తుపాను కురుస్తోంది. అమెరికాలోని ఈస్ట్ ఏరియాలో ఏకంగా మూడు కోట్ల మంది మంచు తుపాను ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా జనజీవనం స్తంభించింది. అమెరికాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అలాగే 7600 విమానాలను రద్దు చేశారు. తుపాను కారణంగా ఏకంగా వంద కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక న్యూయార్క్ , బోస్టన్ వంటి నగరాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది.ఈ విషయాన్ని అమెరికా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

InCorpTaxAct
Suvidha

న్యూయార్క్ సిటీలో ఏకంగా 20 అంగుళాల మేర మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యల కోసం బృందాలను రెడీ చేశారు. పలు ప్రాంతాలకు ప్రయాణాలపై నిషేధం విధించారు. ఇక పోర్ట్ ఆఫ్ వర్జీనియాను మూసివేశారు. ఇక ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →