గౌతమి బాలాశ్రీగా హేమమాలిని ఫస్ట్ లుక్ రిలీజ్..
అలనాటి బాలీవుడ్ మేటి నటి హేమ మాలిని డ్రీమ్ గాళ్ గా ఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వందో చిత్రంలో నటిస్తున్నారు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇందులో శాతకర్ణి తల్లిగా హేమమాలిని నటిస్తున్నారు.
ఆదివారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ .. గౌతమి బాలాశ్రీగా హేమమాలిని ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. గౌతమి పుత్ర శాతకర్ణిగా నందమూరి బాలకృష్ణ, వశిష్టా దేవిగా శ్రియా ఫస్ట్ లుక్ లను ఇప్పటికే విడుదల చేశారు. ఇక దసరా పండుగ సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ కి ఏకంగా రెండు మిలియన్ల హిట్స్ దక్కాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ చిత్రానికి సమర్పణ : బిబో శ్రీనివాస్, కళా దర్శకుడు : భూపేష్ భూపతి, కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం : చిరంతన్ భట్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.