గుడ్డివాడి పాత్రలో రామ్?
అనిల్ రావిపూడిపై నమ్మకమో.. తను కొత్తగా ట్రై చేయాలనే తపనో చెప్పలేం కానీ.. ఓ బ్లైండ్ పర్సన్ రోల్ ని రామ్ చేయనుండడం మాత్రం ఓ వండర్ అనాల్సిందే. తెరమీద ఉన్నంత సేపు – కనిపించినంత సేపు ఎనర్జీ పంచే ఈ హీరోని గుడ్డివాడి ఊహించుకోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా.. ఈ సినిమాని ఎలా తీస్తారనే ఆసక్తి బాగా పెరిగిపోతోంది. అయితే రామ్ ఈ రోల్ ని ఒప్పుకోవడానికి అసలు కారణం నాగార్జున అనే టాక్ వినిపిస్తోంది. మన్మథుడిగా ఇరగదీసే నాగ్.. ఈమధ్య ఊపిరి మూవీ కోసం కుర్చీలోంచి కదల్లేని పారాప్లెజిక్ రోల్ ని చేసి మెప్పించాడు. అంతే కాదు ఆడియన్స్ నుంచి కూడా ప్రశంసలు పొందాడు. ఊపిరి చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు.. చాలా ఏరియాల్లో సూపర్ గా కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత రీచ్ అవడం.. అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా ఉండడం.. ఈ రెండిటినీ ఊపిరి చక్కగా బ్యాలెన్స్ చేసింది. తన దగ్గరకు అలాంటి స్టోరీ దగ్గరకు రాగానే.. రామ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాడని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. సంతోష్ శ్రీనివాస్ తో చేస్తున్న మూవీ పూర్తి కాగానే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ ఈ సినిమాను మొదలు పెట్టనున్నాడు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.