Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

High-Budget for Balayya’s 100th movie..

By   /  August 17, 2016  /  Comments Off on High-Budget for Balayya’s 100th movie..

    Print       Email

balakrishnaబాలయ్య మూవీకి అంత ఖర్చా..?

టాలీవుడ్ లో మాస్ హీరో ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బాలయ్య. ఈ హీరో గారు ‘లెజెండ్’ మూవీతో తన మాస్ ఇమేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ‘లెజెండ్’ భారీ రేంజ్ లో హిట్ అయినా.. కలెక్షన్లు మాత్రం 40 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి బాలయ్య స్టామినా 40 కోట్లుగా అంచనా వేసుకోవచ్చు. ఇంకా బాగా ఆడితే 50 కోట్లు వస్తాయనుకుందాం. కాని ఇప్పుడు ఈ లెక్కకు మించి బాలయ్య తాజా సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ మూవీకి ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

InCorpTaxAct
Suvidha

బాలయ్య వందో చిత్రానికి దర్శకుడు క్రిష్ ఏకంగా 70 కోట్లు ఖర్చుపెట్టిస్తున్నాడట. నందమూరి అందగాడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని టాలీవుడ్ టాక్. అయితే సినిమా బడ్జెట్ విషయంలో బాలయ్య గాని దర్శకుడు గాని నిర్మాతలు గాని ఎక్కడా భయపడటం లేదట. 70 కోట్లు పెట్టడం కూడా పెద్ద రిస్క్ కాదని వీరి ఆలోచనగా ప్రచారం జరుగుతోంది.

ఎందుకంటే ఈ సినిమా బాలయ్య వందో చిత్రం కావడం.. పైగా చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడంతో.. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా చిత్రాన్ని విడుదల చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నా ధీమాతో ఉన్నారట. దీంతో 70 కోట్లు ఖర్చు అనేది పెద్దగా ఖర్చే కాదనేది వారి ఆలోచనగా ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి సంక్రాంతి బరిలో నిలువనున్న ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →