రోజాకు డివిజన్ బెంచ్ లో చుక్కెదురు..
రోజాకు హైకోర్టు డివిజన్ బెంచ్ లో చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సర్కారు అప్పీలు పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను.. డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. అభ్యంతరాలు ఉంటే సింగిల్ బెంచ్ కు వెళ్లాలని రోజాకు సూచించింది.
గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. రోజా సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ వైసీపీ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే సర్కారు మాత్రం ఈ అంశంలో వెనకడుగు వేయలేదు. ఇక రోజా కూడా రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రివిలేజ్ కమిటీ ముందుకు హాజరు కాలేదు.
ఈ అంశంపై న్యాయవాదులు స్పందించారు. స్పీకర్ అధిక శిక్షను విధించినట్లుగా సింగిల్ బెంచ్ భావించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే డివిజన్ బెంచ్ స్పీకర్ పరిధిని పరిగణలోకి తీసుకుందన్నారు. తాజా తీర్పుపై రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.