Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

High Court orders no fireworks in Kerala

By   /  April 12, 2016  /  Comments Off on High Court orders no fireworks in Kerala

    Print       Email

keralaకేర‌ళాలో బాణాసంచా బంద్‌

 

InCorpTaxAct
Suvidha

 

నిషేధం విధించిన కేర‌ళ హైకోర్టు
అనుమ‌తులు లేకుండా పేల్చితే చ‌ర్య‌లు

కేర‌ళ‌లో అనుమ‌తులు లేకుండా బాణా సంచా పేల్చడాన్నినిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగ‌ళ‌వారం తీర్పు ఇచ్చింది. పుత్తింగ‌ళ్ ఆల‌యం వ‌ద్ద బాణా సంచా పేల్చిన‌ప్పుడు ఆ మంట‌ల్లో వంద మందికి పైగా చ‌నిపోయిన నేప‌థ్యంలో హైకోర్టు స్పందించింది. రాష్ట్రంలోని అన్ని ఆల‌యాల వ‌ద్ద సూర్యాస్త‌మ‌యం నుంచి సూర్యోద‌యం వ‌ర‌కు శ‌బ్దాలు వెలువ‌రించే భాణా సంచాను కాల్చ‌డం నేటి నుంచి నిషేధం అని , ఎవ‌రైనా దీన్ని అతిక్ర‌మిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపింది. ప్ర‌జ‌ల ప్రాణాల‌కంటే ఏదీ ముఖ్యం కాద‌ని కోర్టుత‌న ఆదేశాల్లో పేర్కొంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా సంబంధిత శాఖ‌ల అధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి అధికారుల‌కు సూచించింది.
కాగా ఇటీవ‌ల పుత్తింగ‌ళ్ ఆల‌యం వ‌ద్ద బాణా సంచా పేలి మంట‌లు చెల‌రేగిన సంఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 110 మంది చ‌నిపోగా 400 మంది గాయ‌ప‌డ్డారు. బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో కొంత నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంద‌న్న విమ‌ర్శ‌లువ‌స్తున్నాయి. అయితే చికిత్స‌పందుతున్న 400 మంది క్ష‌త‌గాత్రుల్లో కొంత‌మంది ప‌రిస్థితి విష‌మంగానే ఉంది. వైద్యుల వివ‌రాల ప్ర‌కారం మృతుల సంఖ్య మ‌రికొంత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →