Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

High Court puts breaks on KCR government

By   /  August 4, 2016  /  Comments Off on High Court puts breaks on KCR government

    Print       Email

AP highcourt_4_2_0కేసీఆర్ స‌ర్కార్‌కు హైకోర్టు షాక్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. స‌ర్కార్ దూకుడుకు బ్రేకులు వేసింది. భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 123, 124లను బుధవారం హైకోర్టు కొట్టి వేసింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి.. నిమ్జ్ కోసం జరుగుతున్న భూసేకరణ ప్రక్రియను సవాల్ చేస్తూ మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన 20మంది భూ నిర్వాసితులు వేసిన పిటిషన్‌పై ఈ మేరకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిష నర్ల వాదనతో ఏకీభవించింది. అనంతరం జీవోలు 123, 124 కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలం గాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరి హారం, చెల్లింపులపై గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. 2013 భూ సేకరణ చట్టం ఉండగా జీవో నెంబర్ 123 ప్రకారం రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకుంటారని ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించింది.

రైతుల నుంచి నేరుగా భూమిని సేకరించేందుకు ఏర్పాటు చేసిన జీవోలో అనేక లోపాలున్నట్లు రైతులు హైకోర్టుకు విన్నవించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం 123 జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలో కేవలం రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని.. వాస్తవానికి రైతులతో పాటు రైతు కూలీలకు కూడా నష్టం పరిహారం చెల్లించాలని హైకోర్టు సూచించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తాజా తీర్పుతో మల్లన్నసాగర్ సహా పలు ప్రాజెక్ట్‌ల భూసేకరణపై ప్రభావం పడనుంది. కాగా 123 జీవో కొట్టివేతపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించాలని నిర్ణయించిన గ్రామాల్లో సామాజిక ప్రభావం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో గ్రామ పంచాయతీలను భాగస్వాములను చేయడ ప్రధానాంశం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →