Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Hopes soar on separate railway zone for Andhra Pradesh

By   /  June 27, 2016  /  Comments Off on Hopes soar on separate railway zone for Andhra Pradesh

    Print       Email

Suresh prabhu -newఏపీ రైల్వే జోన్ క‌లేనా?

 

InCorpTaxAct
Suvidha

 

 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్ర‌భు ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక అయిన‌నేప‌థ్యంలో ఇక విశాఖ‌కు రైల్వేజోన్ త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని తెలుగువారు ఆశ‌లు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రైల్వే మంత్రి ప్రాతినిధ్యం వహించటం ఇదే మొదటిసారి కావ‌డంతో ఆశ‌లు మ‌రింత పెరిగాయి.అయితే తాజాగా రైల్వే మంత్రి తొలిసారి ఈ అంశం మీద కాస్త డీటైల్డ్ గా మాట్లాడారు.  ఏపీకి జోన్ వ్యవహారం మీద అడిగిన ప్రశ్నలకు ఆయన బ‌దులిస్తూ ‘‘రైల్వే జోన్ ఏర్పాటుకున్న అవకాశాలను అన్వేషించాలని.. ఆర్థికంగా మనుగడనూ చూడాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టారు.

గత ప్రభుత్వమే ఆ పని చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. అది చేయలేదు కాబట్టి.. మేం అన్నిభాగస్వామ్య వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ విషయంలో మేం సాధ్యమైనంత చేస్తున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక్క‌డ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. రైల్వేజోన్ కచ్ఛితంగా ఇవ్వాలన్నట్లుగా చట్టంలో పేర్కొనలేదన్న మాట సురేష్‌ ప్రభు నోట రావటమే కాదు.. అదేదో కాంగ్రెస్ సర్కారే చేసి ఉంటే బాగుండేదన్న మాట చెప్పటం ద్వారా.. ఏపీకి జోన్ కేటాయించటం వెనుక ఉన్న ఇబ్బందల్ని ఆయన చెప్పకనే చెప్పారని చెప్పాలి. తాము సాధ్యమైనంతగా చేస్తున్నామనే చెప్పారే కానీ.. కచ్ఛితంగా ఆ హామీని పూర్తి చేస్తామని చెప్పకపోవటం చూసినప్పుడు.. ఏపీకి జోన్ అంత తేలిగ్గా రాదన్న సంకేతాల్ని ఇచ్చినట్లుగానే భావించాలి. ఏపీకి రైల్వే జోన్ మీద సరేష్  ప్రభు నోరు విప్పిన నేపథ్యంలో అర్థమయ్యేది ఒక్కటే.. చట్టంలో ఉన్నప్పటికీ అమల్లోకి రావటం అంత తేలిక కాదని.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →