Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Hot discussion on AP Special status in Rajya sabha

By   /  March 15, 2016  /  Comments Off on Hot discussion on AP Special status in Rajya sabha

    Print       Email

arun jaitlya - parliament

హాట్ హాట్ గా రాజ్యసభలో ఏపీ స్పెషల్ స్టేటస్ పై  చర్చలు ..

InCorpTaxAct
Suvidha

 

కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నేరవేర్చి తీరుతామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కాంగ్రెస్ ఇచ్చిన నోటీసుపై ఇవాళ చర్చించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జైట్లీ .. ఏపీకి సాయం చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు.14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా ఏపీ రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని ప్రకటించారు. రెవెన్యూ లోటుకు సంబంధించి ప్రతిపైసా కూడా చెల్లిస్తామన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే కొంత నిధులు మంజూరుచేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని తెలిపారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా పోలవరంపై మరింత క్లారిటి వస్తుందన్నారు.

ఏపీలో ఇప్పటికే చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నిధులు కేటాయించామన్నారు. అలాగే అక్కడ శంకుస్థాపనలు కూడా చేపట్టామన్నారు.తమ ప్రభుత్వం ఏపీ అభివృద్దికి ఎంతో చిత్త శుద్ధితో ఉందన్నారు. అయితే స్పెషల్ స్టేటస్ జైట్లీ ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈకారణంగా సభను డిప్యూటీ చైర్మన్ కురియన్ వాయిదా వేశారు.

మరోవైపు.. కాంగ్రెస్ టీడీపీ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు. ఏపీలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీ ఆరాటపడుతోందన్నారు. లోక్ సభలో తలుపులు మూసేసి లైట్లు ఆర్పేసి అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టారని ఈ సందర్భంగా అన్నారు. అలాగే కాంగ్రెస్ సభ్యుల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పలుమార్లు చంద్రబాబు కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక హోదాం అంశంపై మాట్లాడారని చెప్పారు. ఇప్పటికే విభజన జరిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారని అన్నారు.

ఏపీ స్పెషల్ స్టేటస్ ఎప్పుడు: గులాంనబీ ఆజాద్‌ ..

విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు గులాంనబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ ఇచ్చిన నోటీసుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయనమాట్లాడారు. ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని, రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని, ఏపీలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీకి రెవెన్యూ లోటు ఏర్పడిందన్నారు. విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు హామీలు కూడా నెరవేరలేదని పార్లమెంట్ దృష్టికి తెచ్చారు. మరో సభ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ కూడా మాట్లాడారు. నాటి ప్రధాని ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే… వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని కోరారని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కూడా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి సంబంధించినదే కాదు.. పూర్తి సభకు సంబంధించిన అంశమన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →