Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Hot discussions in TRS camp about mayor seat..

By   /  February 6, 2016  /  Comments Off on Hot discussions in TRS camp about mayor seat..

    Print       Email

ghmc mayor seatమేయర్ పీఠం ఎవరిది..?

జీహెచ్ఎంసీలో గులాబీ విరగబూసింది.కనీవినీ ఎరుగని రీతిలో కారు జోరు చూపించింది.ఏకంగా 99 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.దీంతో విపక్షాలకు దిమ్మ తిరిగిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పుడు మేయర్ పీఠం టీఆర్ఎస్ దేనని తెలిసిపోయింది. దీంతో ఈ పీఠంపై కూర్చునేదెవరు..? అనే చర్చ గులాబీ శ్రేణుల్లో ఊపందుకుంది.మేయర్ సీటు బీసీ జనరల్ కు రిజర్వ్ కావడంతో ఆ పదవి కోసం పోటీ పడేవారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా బొంతు రామ్మోహన్, గద్వాల్ విజయలక్ష్మి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

InCorpTaxAct
Suvidha

చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్, పార్టీ సీనియర్ లీడర్ కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మిల గురించే ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచార సమయం నుంచే వీరు మేయర్ అభ్యర్థులమంటూ ప్రచారం జరిగింది. బొంతు రామ్మోహన్ సీఎం కేసీఆర్ కి ఆప్తుడు అని గులాబీ నేతలు అంటూంటారు. ఉద్యమ సమయంలో ఆయన కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. దీంతో ఆయన్ను పోటీలో దించారు. ఆయన గెలుపుకు కృషి చేయాలని స్వయంగా కేసీఆర్ కూడా చెప్పారని సమాచారం. అంతలా ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్న రామ్మోహన్ కే పీఠం దక్కుతుందని కొందరు గులాబీ నేతలు భావిస్తున్నారు.

ఇదిలాఉంటే.. పార్టీలో సీనియర్ నేత కేకే తన కూతురు విజయలక్ష్మి విషయంలో మంత్రాంగం నెరపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీంతో అధిష్టానం ఆశీస్సులు ఆమెకే ఉన్నాయని మరికొందరు నేతలు భావిస్తున్నారు. వీరిద్దరూ కాకుండా శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసిన రాగం నాగేందర్, బీఎన్ రెడ్డి డివిజన్ నుంచి బరిలో నిలబడిన ముద్దగోని లక్ష్మీ ప్రసన్న గౌడ్ కూడా మేయర్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గాంధీనగర్ డివిజన్ నుంచి పోటీ చేసిన ముఠా పద్మానరేష్ కూడా మేయర్ పదవిని ఆశిస్తున్నారు.

అయితే వీరందరిలో ఎవరిని మేయర్ పీఠం వరిస్తుంది అనే అంశంపై ప్రస్తుతం హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. వీరు కాకుండా మరో కొత్త వ్యక్తి పేరును తెరమీదకు తెచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. అయితే .. చివరి నిమిషం వరకు మేయర్ ఎవరు అనేది గోప్యంగా ఉంచాలని టీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →