Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Hot discussions on Sand mafiya in Legislative Council..

By   /  March 23, 2016  /  Comments Off on Hot discussions on Sand mafiya in Legislative Council..

    Print       Email

jagan assembly1

ఇసుక మాఫియాపై మండలిలో వాడీ వేడీ చర్చ..
ఇసుక అక్రమ రవాణా అంశంఫై ఏపీ శాసనమండలిలో హాట్ హాట్ చర్యలు జరిగాయి. ఇందులో భాగంగా అధికార-విపక్ష సభ్యులు మధ్య వాగ్వాదం జరిగింది. ఏకంగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగిన సందర్భాలున్నాయి. అయితే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని ఏపీ మంత్రులు మండలిలో తేల్చి చెప్పారు.

InCorpTaxAct
Suvidha

వైసీపీ సభ్యుల ప్రశ్నల వర్షం..

ఇసుక అక్రమ రవాణాపై శాస‌న మండ‌లిలో వాడివేడి చర్చ జరిగింది. నూత‌న ఇసుక విధానం, గ‌తంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై వైసీపీ సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. దీనికి మంత్రి పీత‌ల సుజాత స‌మాధానం ఇచ్చారు. అనుబంధ ప్రశ్నల్లో భాగంగా కాంగ్రెస్‌ స‌భ్యుడు, మండ‌లి విప‌క్ష నేత సి రామ‌చంద్రయ్య ఏపీ సర్కారుపై మండిపడ్డారు. ఇసుక అక్రమాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్ పేపర్లలో వచ్చిన కథనాలను ప్రస్తావించారు.

రామచంద్రయ్య వర్సెస్ సోమిరెడ్డి..

అయితే.. ఆ శాఖకు చెందిన మంత్రి పీత‌ల సుజాత మండలిలోనే ఉన్నప్పటికీ.. మరో మంత్రి కామినేని శ్రీనివాస‌రావు స‌మాధానం ఇచ్చారు. అదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా విపక్ష సభ్యులపై మండిపడ్డారు. గ‌త సర్కారు అనుస‌రించిన విధానాల వల్లే స‌హజ వ‌న‌రులు చోరీ జ‌రిగింద‌ని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య, సోమిరెడ్డి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

అక్రమార్కులను వదిలిపెట్టేది లేదన్న మంత్రులు..

ఇసుక అంశంపై చర్చ తప్పుదోవ పడుతోందని పీడీఎఫ్ స‌భ్యులు ఛైర్మన్‌ చక్రపాణి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి జోక్యం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఇసుక అక్రమార్కులకు దక్కకుండా ఉండేందుకు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి పీతల సుజాత తెలిపారు. ఓవరాల్ గా ఇసుక అక్రమ తరలింపులపై శాసన మండలిలో హాట్ హాట్ గా చర్చలు నడిచాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →