హోటల్ క్షుధానల దగ్ధమూర్తుల క్షుత్తులార్పు చిత్తముతో
క్షితిజోపరి తలమందున అన్నార్థుల విత్తముతో
నాటి పలనాటి చాపకూటి స్ఫూర్తితో
వెలసినవీ హోటళ్ళు అల్పాహార లోగిళ్ళు
జిహ్వ చాపల్యులకవి శ్వశుర గృహ సమానాలు
జాతిసమైక్యత కవి చక్కని తార్కాణాలు
కులాల కుచ్ఛితాలు మతాల దారుణాలు
మచ్చుకైన సోకనట్టి ఉపాహార దుకాణాలు
అలసి సొలసి దరిజేరిన యాహూతుల సేదతీర్చి
ఆకలితో యలమటించు యన్నార్థుల బాధతీర్చి
ఇష్టకామ్యార్థమెరిగి అందింతురు పేర్చి పేర్ఛి
అతిథులనే యాదరించి పూజింతురు కొల్చి కొల్చి
ఇనుప గజ్జెల తల్లి యిష్టసుతుల కొరకు
గుడిసెలందు వెలసినవీ పేదవారి సేవకొరకు
మధ్యతరగతి మానవులను మన్ననతో
సేవింపగ
హైక్లాసు పేరుతోని యవతరించె నవనియందు
కాసులున్న కామాంధుడి కాంక్షదీర్చు నెపముతో
నక్షత్రాలను జూపుతు నగరాలలోన వెలిసె
అర్ధాకలి యర్భకులకు
నేత్రానందం కొరకై
అర్థనగ్న నృత్యాలను ప్రదర్శించె శాలలివే.
Courtesy: విరించి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.