Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

House –Home!

By   /  February 21, 2016  /  Comments Off on House –Home!

    Print       Email

House –Home!

75ce5f43f4081d1435a80683cbf0b010

House….. Home మధ్యనున్న వ్యత్యాసాన్ని గురించి చెబుతాను !మన సౌలబ్యంకోసం హౌస్ ని ఇల్లు అని,హోమ్ ని గృహం అని అనుకుందాం కాసేపు!ఇల్లు అంటే ఇటుకలతో,కాంక్రీట్ తో నిర్మించబడే ఒక వసతి సదుపాయం!ఇల్లు నిర్మించుకోవాలంటే డబ్బులుంటే సరిపోతుంది!మరి గృహం-అలా కాదు!గృహం కావాలంటే అందులో ఉండాల్సిన ముఖ్యమైన వ్యక్ర్తి -భార్య!ఆ గృహం మరింత సుసంపన్నం కావాలంటే పిల్లలు,మనవలు,మనవరాళ్ళ కిలకిలలు– ఇవన్నీ కూడా ఉండాలి ! వీటన్నిటినీ మించి మరచిపోలేని మధురానుభూతులను,స్మృతులను ఇచ్చేదే నిజమైన గృహం!ఇవి లేని ఇంటికి వెళ్లాలనిపించదు యజమానికి , మిత్రులకు!ఈ మధ్య నా స్నేహితుడి భార్య అకాల మరణం చెందింది!అతను ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు!మెళుకువతో ఉన్నంతసేపు నాతోనే గడుపుతున్నాడు!నా దగ్గరే అతన్ని ఉంచుకుందామంటే,అతనికి అనాధ అయిన ఒక అక్క ఉంది! ఈ పరిస్థితులలో అతను బరువెక్కిన హృదయంతో ఇంటికి చేరుతుంటాడు!దీన్నిబట్టి అర్ధమయింది ఏమంటే,ప్రతి ఇల్లు గృహం కాదు!కానీ,ప్రతి గృహం ఇల్లు కావచ్చు! గృహం అద్దె ఇల్లు కావచ్చు!కానీ ,గృహంలో దొరికే శాంతి ఇంటిలో లభించదు!
శ్లో.న గృహం గృహమిత్యాహుః , గృహిణీ గృహముచ్యతే
గృహం తు గృహిణీహీన మరణ్య సదృశం భవేత్ !
ఆ. గృహము గృహము కాదు గృహిణి లేకున్నచో
గృహిణి యున్నయదియె గృహము. నిజము.
అట్టి గృహిణి మనసు నరసి వర్తించుచు
ముదముఁ గూర్చవలయు ముద్దుచేసి.
భావము-కేవలం ఒక ఇల్లు “ ఇల్లు ” కాదు. సమర్ధించే ఇల్లాలుంటేనే అది , “ఇల్లు” అనిపించుకుంటుంది. ఇల్లాలు లేని ఇల్లు అడవితో సమానం!

InCorpTaxAct
Suvidha

ఆడది లేని ఇంట ఆరిపోయిన వంట అన్నారు! గృహిణి ఉంటేనే అది గృహము!సంసారంలోని ప్రేమసుధాసారాన్ని అందించే వ్యక్తులు,వస్తువులు లేని ఇల్లు ఎప్పటికీ గృహం కాదు ,కానేరదు!అదీ ,ఇంటికి(House), గృహానికి (Home) ఉన్న తేడా! ఆప్యాయంగా పలకరిచే ఇల్లాలు ఉన్న ప్రతి ఇల్లూ ఒక కోవెలే!మీ గృహాలన్నీ కోవెల్ల లాగా ఉండాలని కోరుకుంటున్నాను!

టీవీయస్.శాస్త్రి

878_TVS shastry

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →