Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

How Karnataka Congress Plans To Keep Out BJP In Next Elections?

By   /  March 21, 2018  /  Comments Off on How Karnataka Congress Plans To Keep Out BJP In Next Elections?

    Print       Email

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ స్కెచ్ ఫ‌లిస్తుందా?

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* `లింగాయత్‌` అంశంతో బీజేపీకి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం

* ప్ర‌త్యేక మ‌తంగా గుర్తించాలంటూ అంగీకారం తెలిపిన కాంగ్రెస్ కేబినెట్‌

* బీజేపీ సానుకూల‌మైనా, వ్య‌తిరేక‌మైనా కాంగ్రెస్‌కే లాభం

డెక్క‌న్ అబ్రాడ్‌: క‌ర్ణాట‌క‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ, భార‌తీయ జ‌న‌తా పార్టీలు ఎత్తుల‌కు పైఎత్తులు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా క‌ర్ణాట‌క‌లో ఎక్కువ సంఖ్య‌లో ఉన్న లింగాయ‌త్‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి లింగాయ‌త్‌ను ప్ర‌త్యేక మ‌తంగా గుర్తించాలంటూ క‌ర్ణాట‌క కేబినెట్ అంగీకారం తెల‌ప‌డంతో పాటు ఓ నివేదిక ను రూపొందించి కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించారు. దీంతో కాంగ్రెస్ … బీజేపీని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసింది. ఆరెస్సెస్ ఇప్పటికే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది హిందూ మతాన్ని చీల్చే చర్య అవుతుందని మండిపడింది.లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదా ఇచ్చే అంశంపై నిర్ణయం వెలువరించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. ఈ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తు్న్నామని, త్వరలోనే నిర్ణయం వెలువుస్తామని కేంద్ర హోంశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.

అయితే.. బీజేపీ ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నా, వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూరనుంది. ఆవిధంగా పక్కా వ్యూహం రచించడంలో కర్ణాటక కాంగ్రెస్ విజయవంతమైంది. లింగాయత్‌లకు మతం హోదా కల్పించే తమ ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే.. అది తమ విజయంగా చెప్పుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తోంది. ఒకవేళ కేంద్రం ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తే.. తాము అంగీకరించినా బీజేపీ అడ్డుపడిందని ప్రచారం చేయడం ద్వారా మరింత లాభం పొందడానికి కాంగ్రెస్ నేతలు స్కెచ్ వేశారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలతో కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టంతో పోలిస్తే లాభమే ఎక్కువ. మొత్తంమీద ఎన్నికల ముందు కర్ణాటకలో లింగాయత్‌ల ఓట్లను కొల్లగొట్టే దిశగా కాంగ్రెస్ పటిష్టమైన వ్యూహాన్నే అనుసరించింద‌నే చెప్పాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →