Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

How to express LOVE!

By   /  June 5, 2016  /  No Comments

    Print       Email

13265908_901394789988543_5720532643438800026_nప్రేమ మహిమ తెలిపేందుకు మాటలసలు ఉంటాయా..!?
పరిమళించు గులాబీకి హద్దులసలు ఉంటాయా..!?

మౌనంగా ప్రశ్నించే మనసు గొడవ మామూలా..!?
చిరునవ్వును నిలదీసే చూపులసలు ఉంటాయా..!?

InCorpTaxAct
Suvidha

పగలు రేయి కనుదోయికి తెలిసేనా విప్పకనే.!?
గుండెలయను అనువదించు భాషలసలు ఉంటాయా..!?

విరహమెలా చిత్రహింస అవుతుదో నేనెరుగను..!
చెలిమివీణ రాగాలకు స్వరములసలు ఉంటాయా..!?

కలతలేని కలహంసను ఖైదు ఎలా చేస్తావోయ్..!?
నిలువరించు మోహాలకు ముసుగులసలు ఉంటాయా..!?

ఓ నా ప్రియ మాధవుడా..ఎవరికెలా చెప్పాలిర..!?
పరవశించు ప్రణయాలకు..పరుగులసలు ఉంటాయా..!?

 

Author:  Madhav Rao Koruprolu

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →