Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

How To Handle Roja? – CBN

By   /  April 30, 2016  /  Comments Off on How To Handle Roja? – CBN

    Print       Email

4396_YCP MLA Rojaరోజాను.. ఏం చేద్దాం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్‌జ‌గ‌న్‌కు ఎంత భ‌య‌ప‌డుతున్నాడో.. అంత‌కంటే ఎక్కువ‌గా రోజా మాట్లాడే మాట‌ల‌కు భ‌య‌ప‌డుతున్నాడు. పార్టీ ఫిరాయింపుల‌పై వైయ‌స్ జ‌గ‌న్ కు అంటే రోజానే ఎక్కువ మాట్లాడుతోంద‌ని, అది కూడా వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుతూ త‌న ప‌రువు తీస్తోంద‌ని చంద్ర‌బాబు స‌న్నిహితుల ద‌గ్గ‌ర బాధ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

InCorpTaxAct
Suvidha

రోజాను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు స‌స్పెండ్ చేసినా కూడా ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డం లేద‌ని, రోజాను ఎలాఎదుర్కోవాలో చెప్పండంటూ బాబు మంత్రుల‌ను అడిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. రోజా ఏది మాట్లాడినా అది హాట్ టాపిక్ అవుతోంద‌ని, ఆమె మాట్లాడే మాట‌లు జ‌నాల్లోకి కూడా ఎక్కువ‌గా వెళ్తూ పార్టీకి న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని, రోజాను ఎలాగైనా స‌రే మాట్లాడ‌నీయ‌కుండా చేయాల‌ని టీడీపీ స్కెచ్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రోజా తాజాగా బాబుకు ఒక స‌వాల్ కూడా విసిరింది.  పూజ‌లు.. పున‌స్కారాలు. ముహూర్తాలకు ఎక్కువ‌గా ప్రాధాన్యాత ఇస్తున్న చంద్ర‌బాబు  నాయుడు తాను  ప్ర‌జ‌ల సొమ్మ‌ను దోచుకోలేద‌ని, పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డం లేద‌ని చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయ‌కుడిపై ఒట్టువేసి చెప్ప‌గ‌ల‌వా బాబు అంటూ స‌వాల్ విసిరింది.

కాణిపాకం వినాయ‌కుడిపై ప్ర‌మాణం చేస్తే దానిని కోర్టులుకూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాయ‌ని, అలాంట‌ప్పు నీ స‌చ్చీల‌త‌ను నిరూపించ‌డానికి నువ్వు కాణిపాకం వినాయ‌కుడిపై ఒట్టి వేయ‌డానికి సిద్ధ‌మా అని ప్ర‌శ్నించింది.  ఇలా రోజూ ఏదొక విధంగా పార్టీని, బాబును ఇబ్బంది పెడుతున్న రోజాను ఎక్క‌డా మాట్లాడ‌నీయ‌కుండా చేయ‌డానికి టీడీపీ పెద్ద స్కెచ్ వేస్తున్న‌ట్లు స‌మాచారం. రోజా ఒక‌వేళ టీడీపీలోకి  వ‌స్తానంటే ఆమె కోరుకున్న హోదాకానీ.. ఇంకైమైనా కానీ ఇస్తామ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తామ‌ని టీడీపీ ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. రోజా ఆఫ‌ర్ల‌కు ప‌డిపోతుందా? ప్ర‌తిప‌క్షంలోనే కొన‌సాగుతుందా? అనేది వేచి చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →