Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Huge changes in H1B visa..

By   /  March 9, 2017  /  Comments Off on Huge changes in H1B visa..

    Print       Email

h1-b-visaహెచ్ 1 బీ వర్క్ వీసాలో భారీ మార్పులు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

అత్యుత్తమ ప్రతిభావంతులను అమెరికాకు తీసుకుపోయేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్ 1బీ వర్క్ వీసా, ఉద్యోగాల సంబంధిత గ్రీన్ కార్డ్ విధానాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన ఓ సెనేటర్ ఈ విషయాన్ని తెలిపారు. ఆర్కాన్సాస్ కు చెందిన టామ్ కాటన్ అనే సెనేటర్ బుధవారం డోనాల్డ్ ట్రంప్ తో సమావేశం అయ్యారు. ఇప్పుడు ఉన్న వీసాల వల్ల అత్యంత ప్రతిభావంతులు అమెరికా రాలేకపోతున్నారని అన్నారు. వారిని వచ్చేలా చేసేందుుకు వీసా విధానాన్ని సవరించాలని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే దీనిపై డోనాల్డ్ ట్రంప్ టీమ్ తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు.
ప్రస్తుతం ఉన్న హెచ్‌1బీ టెంపరరీ వీసా, ఈబీ1, ఈబీ2 వంటి గ్రీన్‌ కార్డులతో అత్యుత్తమ ప్రతిభావంతులను అమెరికాకు తీసుకురావాలని అధ్యక్షుడు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు ఉన్న విధానాల వల్ల తాము అనుకున్నది సాధించలేకపోతున్నామని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభావంతుల స్థానంలో మిడిల్ స్థాయిలో ఉన్న వారిని తీసుకుంటున్నారని అన్నారు. దీనివల్ల ఇక్కడి జనం ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆరోపించారు. పెద్దగా టెక్నికల్ మేధావులు అవసరం లేని డిస్నీ, సదరన్ కాలిఫోర్నియా వంటి చోట్ల విదేశీయులను నియమించుకుంటున్నారని అన్నారు. వాస్తవానికి అమెరికన్లు చేయలేని ఉద్యోగం అంటూ లేదని అన్నారు. వచ్చే రోజుల్లో అమెరికన్లు అన్ని రకాల ఉద్యోగాలు చేస్తారు అని అన్నారు.

ఇప్పుడున్న విధానం ప్రకారం 15మందిలో కేవలం ఒకరిని మాత్రమే అమెరికా రానిస్తామని అన్నారు. ఇదే విషయాన్ని తమ భేటీలో ట్రంప్ తనకు తెలిపారని అన్నారు. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మొదటి ఏడాది 6,37,960 మంది.. పదో సంవత్సరం తర్వాత 5,39,958 మంది వస్తారని భావిస్తున్నామన్నారు. ఇది గతంలో వచ్చిన వలసలతో పోల్చుకుంటే 50 శాతం తక్కువ అని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →