Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Hundreds flee forest fires in Portugal & Madeira

By   /  August 10, 2016  /  Comments Off on Hundreds flee forest fires in Portugal & Madeira

    Print       Email

portugal firesతగలబడుతున్న పోర్చుగల్..

 
పోర్చుగల్ తగలబడిపోతోంది. మడేయిరా దీవుల్లో మంటలు దావానంలా వ్యాపిస్తున్నాయి. ఈ మంటల బారిన పడి ఇప్పటివరకు 174 మంది గాయాలపాలయ్యారు. వీరిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు క్రమేణా రాజధాని ఫుంచాల్ ను ఆక్రమిస్తున్నాయి. దీంతో 27 నివాసాలను ఖాళీ చేయించారు.ఈ విషయాన్ని ఓ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

InCorpTaxAct
Suvidha

చాలా రోజులుగా పోర్చుగీస్ లో కార్చిచ్చు కొనసాగుతోంది. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే చివరకు తమవల్ల కాదంటూ చేతులు ఎత్తేశారు. నాలుగు వేలమంది ఫైర్ సిబ్బంది, 26 వాటర్ డంపింగ్ విమానాలు, 1262 వాహనాలు.. 149 చోట్ల మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.portugal fires 1

ఆగస్టు నెలలో పోర్చుగీస్ లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీనికి తోడు ఈదురు గాలుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుత పరిస్థితి ఇదే కారణమని అధికారులు భావిస్తున్నారు. మంటలు తీవ్రంగా ఉండటంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →