Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Hyderabad Emerges As The Best City For Quality Of Living

By   /  March 21, 2018  /  Comments Off on Hyderabad Emerges As The Best City For Quality Of Living

    Print       Email
నిజంగా `భాగ్య‌`న‌గ‌ర‌మే
* వ‌రుస‌గా నాల్గ‌వ‌సారి క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్‌లో మొద‌టి స్థానం
* అట్ట‌డుగు స్థానంలో ఢిల్లీ
* విశ్వ‌న‌గ‌రం దిశ‌గా దూసుకెళ్తున్న హైద‌రాబాద్‌
భాగ్య‌న‌గ‌రం.. ఈ పేరు ఇప్పుడు విశ్వ‌వ్యాప్తంగా వినిపిస్తోంది. మ‌హా..మ‌హా న‌గ‌రాల‌ను వెన‌క్కి నెట్టేస్తూ ముందుకు.. మునుముందుకు దూసుకుపోతోంది. ఒక‌టి కాదు.. రెండు కాదు వ‌రుస‌గా నాల్గొవ సారి క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్‌లో మొద‌టి స్థానంలో నిలిచింది. వివ‌రాల్లోకి వెళ్లితే…  క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్ 2018 పేరుతో మెర్సర్ ఈ లిస్ట్‌ను విడుదల చేసింది. నేరాల శాతం తక్కువగా ఉండటం, ఏ కాలంలోనైనా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రేటింగ్ ఇస్తారు. భాగ్యనగరంతో పాటూ పుణె కూడా ఈ లిస్ట్‌లో టాప్‌గా ఉంది. ఢిల్లీ వరుసగా మూడోసారి అట్టడుగు స్థానంలో ఉంది. వాయు కాలుష్యం, భారీ ట్రాఫిక్‌తో ఈ లిస్ట్‌లో పడిపోతోంది. మిగిలిన మెట్రో నగరాలు ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు కూడా హైదరాబాద్‌, పుణెల కంటే వెనుకబడిపోయాయి. విశ్వనగరం దిశగా దూసుకెళుతున్న హైదరాబాద్‌కు ఈ ఘనత మరో బూస్టప్ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌ 142వ ర్యాంక్‌ దక్కించుకుంది.
హైదరాబాద్‌తో పాటు పుణె కూడా ఇదే ర్యాంక్‌లో ఉంది. పుణె కూడా 151వ ర్యాంక్‌ నుంచి 142వ స్థానానికి వచ్చింది. బెంగళూరు 149, చెన్నై 151, ముంబై 154, కోల్‌కతా 160, ఢిల్లీ 162 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నా ఉత్తమ నగరంగా తొలి ర్యాంకు దక్కించుకుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ రెండో ర్యాంక్‌లో ఉంది. ఏది ఏమైనా హైద‌రాబాద్ న‌గ‌రం ఈ వార్డును వ‌రుస‌గా నాల్గొవ గెలుచుకోవ‌డంపై తెలుగు ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →