Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Hyderabad ranked no 10 in the Nation….

By   /  July 29, 2016  /  Comments Off on Hyderabad ranked no 10 in the Nation….

    Print       Email

Hyderabad Telanganaటాప్ టెన్ లో హైదరాబాద్

 

InCorpTaxAct
Suvidha

 

 

దేశంలో ఉద్యోగాలు దక్కించుకుంటున్న యువత మనస్సుల్లో హైదరాబాద్ కూ చోటు దక్కింది. అయితే హైదరాబాద్ దేశంలోని  టాప్ టెన్ లో పదవ స్థానంలో ఉంది. దేశంలోని యువత ఎక్కడ ఉద్యోగాలు చేయటానికి ఇష్టపడుతున్నారనే అంశంపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని  ఎక్కువ మంది యువత  ఉద్యోగం కోసం ఢిల్లీకి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ చుట్టూ ఉన్న దేశ రాజధాని ప్రాంతం, బెంగళూరు, చెన్నై, లక్నో నిలిచాయి. హైదరాబాద్ పదో స్థానంలో నిలిచింది. అయితే మహిళలు ఉద్యోగం కోరుకుంటున్న టాప్-10 నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఈ సర్వేలో పాల్గొన్న 5.2 లక్షల మంది యువతలో 38.12 శాతం మంది ఇటీవలే ఉద్యోగాలు పొందిన వారున్నారు. ఇప్పుడు యువత కేవలం ఉద్యోగాలే కాకుండా తాము ఉద్యోగం పొందే ప్రాంతంలో ఉన్న పరిస్థితులు..సౌకర్యాలు..వాతావరణం వంటి అంశాలను పరిశీలించిన నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యంగా ఐటి ఉద్యోగులు అయితే అంతగా సౌకర్యాలు లేని సిటీల వైపు ఏ మాత్రం మొగ్గుచూపటం లేదు. దేశంలోని పలు పారిశ్రామిక, నైపుణ్య సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకో విష‌యం ఏంటంటే టాప్ టెన్‌లో ఏపీ లేక‌పోవ‌డం విశేషం. తాజాగా వెల్ల‌డైన విష‌యాలు ఏంటంటే అక్క‌డ ఐటీ ప‌రిశ్ర‌మ‌లు పెద్ద‌గా లేక‌పోవ‌డం.. సౌక‌ర్యాలు అంతంత మాత్రంగానే ఉండ‌డంతో అక్క‌డి వ‌చ్చేందుకు ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →