Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Suspected ISIS terror module busted by NIA after raids

By   /  June 29, 2016  /  Comments Off on Suspected ISIS terror module busted by NIA after raids

    Print       Email

Hyderabadభారీ కుట్ర భ‌గ్నం

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌పంచంలో ఏ మూల ఉగ్ర‌వాద దాడులు జ‌రిగినా వెంట‌నే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం అప్ర‌మ‌త్త‌మ‌వుతూనే ఉంటుంది. ఆ మూలాలు హైద‌రాబాద్‌లో దొరుకుతూనే ఉంటున్నాయి. తాజాగా ట‌ర్కీ దేశ రాజధాని, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ముగ్గురు ఉగ్ర‌వాదులు మార‌ణ‌కాండ‌కు పాల్ప‌డి అమాయ‌కులైన ప్ర‌యాణికుల ప్రాణాల‌ను బ‌లికొన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌, ఢిల్లీ పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మాదాపూర్‌, బేగంబజార్‌, దిల్‌సుఖ్‌నగర్‌ల‌లో విధ్వంసం సృష్టించాల‌ని ఉగ్ర‌వాదుల వేసిన భారీ స్కెచ్‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) అధికారులు, దాదాపు వంద మంది హైదరాబాద్‌ పోలీసులు వివిధ బృందాలుగా విడిపోయి పాతబస్తీలోని మీర్‌చౌక్‌, మొఘల్‌పురా, భవానీనగర్‌, చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ల పరిధిలోని 10 ప్రాంతాల్లో మూకుమ్మడిగా దాడులు చేశారు. బార్కస్‌, లకడ్‌కోట్‌, మొఘల్‌పురా, తలాబ్‌కట్ట, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వాళ్లంతా ఐఎస్‌ సానుభూతిపరులు. వారి నుంచి పెద్దఎత్తున మారణాయుధాలను, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తద్వారా, హైదరాబాద్‌లో మారణ హోమానికి ఐఎస్‌ ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్‌ఐఏ, హైదరాబాద్‌ పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఈ సందర్భంగా, పాతబస్తీ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇలియాస్‌ యాజ్దానీ (24), ఇబ్రహిం యాజ్దానీ (30), హబీబ్‌ మహమ్మద్‌ (32), మహమ్మద్‌ ఇర్ఫాన్‌ (27), అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ (31)లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, టర్కీలో ఉగ్ర దాడులు, హైదరాబాద్‌లో అరెస్టుల నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఆక్టోపస్‌ బలగాలు, సీఐఎ్‌సఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, స్థానిక పోలీసులు అణువణువు తనిఖీలు జరిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →