నేనూ.. రైతు బిడ్డనే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ` ఏరువాకా సాగారో` అంటూ కాడిపట్టి దుక్కి దున్నారు. ఆపై వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా సీఎం బాబు మాట్లాడుతూ తాను ఒక రైతు బిడ్డనేనని, తనకు రైతుల కష్టాలు తెలుసనని చెప్పుకొచ్చారు. రైతును రాజుగా చేయడమే తన లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకం తీసుకున్న `ఏరువాకా సాగారో` కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు పశ్చిమగో దావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబుమాట్లాడుతూ గతంలో మీ కోసం పాదయ్త్రా ద్వారా రాష్ట్రమంతా పర్యటించి ప్రజలు,రైతుల కష్టాలు తెలుసుకున్నానని, అప్పుడే రైతులకు హామి ఇచ్చానన్నారు. బకాయిలు మాఫీ చేస్తానని చెప్పినమా అమలుచేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని రూ 16 వేల కోట్లు లోటుతో విభజించినప్పటికీ రైతు కళ్ళలో వెలుగుచూ డటమే లక్ష్యంగా రుణమాఫీని అమలు చేస్తున్నామన్నారు. రూ 50 వేలు లోపు రుణమున్న ప్రతివారికి మాఫీచేశామని, మిగిలిన రుణాల మాఫీకి యత్నం జరుగుతుందన్నారు.
వెదజల్లే పద్దతి ద్వార సాగులో లాభాలు తీసుకురావచ్చన్నారు.అవసరమైతే రెండు పంటలు వరి, మూడో పంట అపరాలు వేసి అధిక దిగుబడులు సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా రైతులు ఆలోచించాలన్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన కేంద్ర ప్రభుత్వం సహాకారంతో పొలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. చేపల పెంపకం గోదావరి జిల్లాలో లాభాదాయకంగా ఉందని, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటే ఎవరికి ఇబ్బందికలగదన్నారు. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ సిట్లను ఇచ్చిన పశ్చిమగోదావరి ప్రజలను ఎప్పటికీ మరచిపోనని, జిల్లా ప్రజలకు అండదండలుగా ఉంటానని ఉద్వేగభరితంగా మాట్లాడారు. కాగా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు `ఏరువాకా సాగారో` కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుండడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.