Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

I am known as palnaati PULI, says Kodela Siva Prasad

By   /  June 20, 2016  /  Comments Off on I am known as palnaati PULI, says Kodela Siva Prasad

    Print       Email

kodelaన‌న్ను ప‌ల్నాటి పులి అని పిలుచుకుంటారు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను చాలా నిర్భ‌యంగా చెప్పంగా చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల్లో డ‌బ్బుప్రాముఖ్య‌త పెరిగింద‌న్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయాలు   భ్ర‌ష్టు ప‌ట్టాయ‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంటర్య్వూలో 1983లో అన్న ఎన్టీఆర్ పిలిచి సీటు ఇచ్చినప్పుడు.. ఆ ఎన్నికల్లో కోడెల ఖ‌ర్చుచేసింది రూ.30 వేలు మాత్ర‌మేన‌ని నిన్న ఎన్నిక‌ల్లో ఆయ‌న ఖ‌ర్చు చేసింది రూ.11 కోట్లు కోడెల చెప్పిన‌ట్లు స‌ద‌రు మీడియా సంస్థ పేర్కొంది.  ఆయ‌న‌ను అక్క‌డి వారు ప‌ల్నాటి పులి అని పిలుచుకుంటార‌ని కోడెల చెప్పిన‌ట్లు పేర్కొంది. ఆ ప్ర‌త్యేక ఇంటర్య్వూలో కోడెల  ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

* నేను ఫ్యాక్షనిస్ట్ ను కాను. దాని బాధితుడ్ని. నాపై నాలుగుసార్లు బాంబుదాడులు జరిగాయి. ఫ్యాక్షనిస్ట్ అని అనిపించుకుంటే మీ దగ్గరకు ఎవరూ రారంటూ ఓ పెద్దాయన సలహా ఇచ్చారు.

* రాజకీయాల్లోకి రావాలంటూ అన్న ఎన్టీఆర్ పిలుపునివ్వటమే కాదు.. కోరి మరీ టికెట్ ఇచ్చారు. దాన్ని ఎప్పటికి మర్చిపోలేను.

*గత రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు అస్సలు పోలికే లేదు. గతానికి భిన్నంగా ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయి. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఆ తరహా రాజకీయాలే కనిపిస్తున్నాయి.

*ఈసారి మంత్రి పదవి వస్తుందనుకున్నా. కానీ.. స్పీకర్ పదవి వచ్చింది. ఈ పదవికి ఫిట్ కానన్న భావన ఉండేది.

*ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు.. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మైకు తీసుకొని మాట్లాడాలంటే బెరుగ్గా ఉండేది. స్టేజ్ మీదకు మాట్లాడటానికి వెళితే ఇబ్బందిగా ఉండేది.

*మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును అడిగా. ఒకవేళ కుదరకపోతే పదవి ఇవ్వకపోయినా ఫర్లేదన్నా. ఆయనేమో స్పీకర్ పదవి ఇస్తానన్నారు. సరేనన్నా.

*భావోద్వేగాల్నిచంపేశా. స్పీకర్ గా వందశాతం పని చేయాలన్న ఆలోచనతోనే పని చేస్తున్నా. అధికారపక్ష ఏజెంటుగా వ్యవహరించటం లేదు.

*ప్రతి స్పీకర్ మీదా ఆరోపణలు.. విమర్శలు మామూలే. ప్రతిపక్షాలకే ఎక్కువ అవకాశం ఇస్తున్నా. స్పీకర్ పదవిలో అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు.

* సబా గౌరవం కోసమే రోజాను సస్పెండ్ చేశాం. ఆమె భాష.. హావభావాలు బాగుండవు. కోర్టు కూడా రోజాను తప్పు పట్టింది.

* క్షమాపణలు చెప్పాలని కోర్టు చెప్పినా ఆమె వినలేదు. ఆమె నుంచి క్షమాపణలు కోరుతూ ఎలాంటి లేఖ రాలేదు.

* తప్పు దిద్దుకునే అవకాశాన్ని రోజా కోల్పోయారు.

* పార్టీ ఫిరాయించటం వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. జరుగుతున్న విషయాల్ని గమనిస్తున్నా. స్పీకర్ గా ఏం చేయాలో అదే చేస్తా.

* పార్టీను వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు సరిగా లేవు.

* ప్రజలు ప్రేమతో పల్నాటి పులి అని పిలుచుకుంటారు. అదంతా వారికి నా మీదున్న అభిమానమే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →