Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

I am not anti Hindu Says Prakash Raj

By   /  January 20, 2018  /  Comments Off on I am not anti Hindu Says Prakash Raj

    Print       Email

నేను హిందూ వ్యతిరేకిని కాదు : ప్రకాశ్ రాజ్

 

InCorpTaxAct
Suvidha

 

 

భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ప్రకాశ్ రాజ్ గత కొంత కాలంగా రాజకీయలపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో తనదైన శైలిలో బిజెపి నేతలపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రముఖ లేడీ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించకపోవంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బిజెపి నేతలను కొన్నాళ్ళనుండి ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

మొన్నబెంగళూరు లో ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించి వెళ్ళాక బిజెపి యువ మోర్చా కార్యకర్తలు గోమూత్రంతో ఆ చోటును శుభ్రం చేసిన విషయం సంచలనం రేపింది. ఈ విధంగా గోమూత్రంతో శుభ్రం చేయడం బాగుంది, కానీ నేను వెళ్లే ప్రతిచోటుని వారు ఇలానే శుభ్రం చేస్తారా అని తనదైన శైలిలో ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఒక సభలో ఆయన ప్రసంగిస్తూ తాను హిందువులకు ఎప్పుడు వ్యతిరేకం కాదని, కేవలం మోడీ, అమితా షా, హెగ్డేలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి బిజెపి నేతలపై ప్రకాష్ రాజ్ వ్యవహరించే తీరును చూస్తే ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని జనం అభిప్రాయపడుతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →