Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

I can also do Six Pack – Deepika

By   /  June 19, 2016  /  Comments Off on I can also do Six Pack – Deepika

    Print       Email

arjun & deepika (4)సిక్స్‌ప్యాక్ నేనూ చేస్తా!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఎందులోనైనా మ‌గ‌వాళ్లు తీసిపోమంటున్నారు మ‌గువ‌లు. ప్ర‌తి దాంట్లో స‌మానం అంటున్నారు. కొన్ని విష‌యాల్లో అయితే మ‌గ‌వాళ్ల‌కే స‌వాల్ విసిరేస్తున్నారు. తాజాగా బాలివుడ్ హీరోయిన్ దీపికా ప‌డుకునే కూడా అలాంటి స‌వాల్‌నే విసురుతోంది. సిక్స్ ప్యాక్ అనేది మ‌గ‌వాళ్లే కాదు ఆడ‌వాళ్లు కూడా చేస్తార‌ని, అది తాను చేసి చూపిస్తానంటోంది. అయితే దీపిక సిక్ ఫ్యాక్ చేసేది బాలివుడ్‌ సినిమా కోసం కాద‌ట‌.  హాలీవుడ్‌ సినిమా కోసమట! దీపిక హాలీవుడ్‌కి వెళ్ళి అక్కడ సినిమాలు చేయడం ప్రారంభించాక అక్కడివారిలాగా ఆలోచించడం మొదలు పెట్టింది అంటున్నారు బాలీవుడ్‌ జనాలు. హాలీవుడ్‌ హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా సిక్స్‌ప్యాక్‌లు పెంచేసి ఫైటింగ్‌లు గట్రా చేసేస్తుంటారు. ఇప్పుడు దీపిక కూడా వారిని చూసి తనూ అలా తయారవ్వాలని జిమ్‌లో కష్టపడుతోందని చెబుతున్నారు.

సన్నగా నాజూకుగా ఉండే దీపికను ఇప్పుడు సిక్స్‌ప్యాక్‌లో చూడగలమా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారట కూడా! ఆరుపలకల దేహంతో దీపిక మెప్పిస్తే.. సిక్స్‌ప్యాక్ చేసిన తొలి హీరోయిన్‌గా రికార్డు  సృష్టించడం ఖాయం. కాగా ఆమె మెప్పిస్తుందో లేదో చూడాలంటే మ‌రికొంత కాలం ఆగ‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే ఒక‌వేళ దీపికా సిక్ ఫ్యాక్‌తోమెప్పిస్తే మాత్రం ఆమె బాట‌లో మ‌రికొంత‌మంది హీరోయిన్లు న‌డిచే అవ‌కాశం లేక‌పోలేద‌ని సినీ విశ్లేష‌కుల అభిప్రాయం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →