మౌనం పాటించిన సమంత
అందాల తార సమంత ఎందుకో మౌనం పాటించింది. మామూలు అయితే తాను నటించిన సినిమా గురించి సోషల్ నెట్వర్క్లో హడావుడి చేసే సమంతా బ్రహ్మోత్సవం సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది. మామూలుగా అయితే సరిగ్గా రిలీజ్ కు ఒక రోజు ముందు.. సినిమా రిజల్టు ఎలా ఉండోబోతోందో ఏంటో అని ఫీలవుతూ ఒక ట్వీటు వేస్తుంటుంది సమంత. ఈసారి అలాంటిదేం లేదు. కాకపోతే తన ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ మాత్రం రీ ట్వీట్ చేసింది. ఆ తరువాత తన సన్ సైన్ ‘టారస్’ (వృషభ రాశి) గురించి ఏదో రీ ట్వీట్ చేసింది. అందులో ఒక ట్వీట్ మాత్రం ”టారస్ తో బలవంతంగా ఏం పనీ చేయించలేరు. ఈ రాశి వారిని ఈర్ష్య పడేలా చేయాలని చూస్తే.. వారికి మీ మీద ఇంట్రెస్ట పోతుంది” అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా ట్వీటేసింది.
మరి అవన్నీ బ్రహ్మోత్సవం గురించేనేమో తెలియదు కాని.. ఆ తరువాత కూడా బ్రహ్మోత్సవం గురించి అమ్మడు ఏమీ చెప్పలేదు. రిజల్టు ఎలా ఉన్నా.. తన క్యారెక్టర్ చాలా బాగుందని.. ఈ సినిమా వలన చాలా నేర్చుకున్నా.. నా జీవితం గురించి చాలా తెలుసుకున్నా.. అంటూ ప్రీ రిలీజ్ ఇంటర్యూల్లో చాలా చెప్పిన సమంతం.. ఇప్పుడు ఎందుకిలా సినిమా గురించి సైలెంట్ అయిపోయిందటారు? కాని అది మహేష్ అభిమానులను హర్ట్ చేస్తుంది కదా. ఇది టూ మచ్ అంటున్నారు వారు. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.