ప్రియాంక తన సక్సెస్ స్రీకెట్ మీద బుక్ రాయాలి: కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ కన్ను ప్రియాంక చోప్రా మీద పడింది.హాలీవుడ్ లో సక్సెస్ కావడంతో అక్కడ ప్రియాంక నిలదొక్కుకోగలిగిన సంగతి తెలిసిందే. అయితే కత్రినా ఈమె సక్సెస్ సీక్రెట్ కనుక్కునే పనిలో పడింది. అంతేనా.. ఫితూర్ ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లడుతూ.. ప్రియాంక హాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రస్తావించింది. హాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో సినిమాలు చేయాలంటే ఎంతో డేర్ కావాలని అంటోంది కత్రినా. ఎంతో ధైర్యం , పట్టుదల, ఏకాగ్రత కావాలని అంటోంది. ఆ లక్షణాలు అన్ని ప్రియాంకలో ఉన్నాయని నిరూపించిందని కత్రినా పేర్కొంది. అంతేకాదు.. ప్రియాంక విజయం నిజంగా అభి నందించ తగ్గదని ప్రశంసలు కురిపించింది. అయితే ఈ సక్సెస్ వెనుకున్న రహస్యం ఏంటో తనకు తెలుసుకోవాలని ఉందని అంటోంది. షూటింగ్ కోసం ఏకంగా 22 గంటలు ప్రయాణిస్తూ హాలీవుడ్ లో ఎలా నిలదొక్కుకోగలిగిందో ప్రియాంక ఓ పుస్తకం రాయాలని అంటోంది.కత్రినా నటించిన ఫితూర్ మూవీ శుక్రవారం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.