Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

I will not run away, I will fight for issues: Pawan Kalyan

By   /  March 12, 2018  /  Comments Off on I will not run away, I will fight for issues: Pawan Kalyan

    Print       Email

నేను పారిపోను..ప్ర‌శ్నిస్తాను

Suvidha
Biryani Pot

 

 

 

 

* రాజ‌కీయాల్లో క‌చ్చితంగా ఎదుగుతాం

* 14వ తేదీ అంద‌రికీ స‌మాధానం చెబుతాం

* ఇంటికి భూమి పూజ అనంత‌రం మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

డెక్క‌న్ అబ్రాడ్‌: తాను భావితరాల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, సమస్యల నుంచి ఎప్పుడూ పారిపోనని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు.  ఆదివారం రాత్రే సతీసమేతంగా ఆయన విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్.. ఈ ఉదయం కాజాలో సొంతింటికి భూమిపూజ చేశారు.  అనంతరం మీడియాతో మాట్లాడారు. 2007 నుంచి రాజకీయాల్లో ఉన్న తనకు అప్పటి నుంచి ఇప్పటివరకు అందరిపై అవగాహన ఉందని.. వారందరికీ 14వ తేదీన జరిగే మహాసభలో బలమైన దిశానిర్దేశం చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.  మిగతా వారి లాగా తనకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదని.. తన నాన్న సీఎం కాదని.. రాజకీయాల్లో అన్నింటిని అధిగమించి ఎదగడానికి కావలసిన సహనం తనకు ఉందని చెప్పారు. ఇక “మిమ్మల్ని చంద్రబాబు డైరక్షన్ చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంది కదా” అన్న ప్రశ్నకు.. “టీడీపీనే ఎందుకనుకోవాలి? బీజేపీ అనుకోవచ్చు కదా? నరేంద్రమోదీ అనుకోవచ్చు కదా?” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

ఇక పార్టీ పరంగా తదుపరి ప్రణాళికలను కూడా 14వ తేది చెబుతానని అన్నారు. అలాగే తన ఆస్తులు ఎవరినీ దోచేసినవి కావని, తాను కష్టపడి సంపాదించుకున్నవి.. ప్రజలు ప్రేమతో ఇచ్చిన ఆస్తులు ఉన్నాయని… కొన్ని సార్లు పోగొట్టుకున్నా మళ్లీ తిరిగి సంపాదించుకున్నానని, అవసరం వస్తే ఆస్తులు ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Nata Matrimony- @NATA Convention, Philadelphia, PA July 6th to July 8th 2018

Read More →