Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Pakistan’s historic win over arch-rivals India in thrilling Champions Trophy final

By   /  June 18, 2017  /  Comments Off on Pakistan’s historic win over arch-rivals India in thrilling Champions Trophy final

    Print       Email

ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న పాకిస్థాన్ ..

 

EIS
EnGeniusInc

 

 

ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరులో భారత్ పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో పాకిస్థాన్ పై చేయి సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. భారత్ ముందు 339 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన భారత బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. ఓపెనర్లు విఫలం కాగా.. హార్దిక్‌పాండ్యా (76; 43 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు.

బౌలింగ్‌లో మహ్మద్‌ ఆమిర్‌ (316), హసన్‌ అలీ (3/19) షాదాబ్‌ ఖాన్‌ (2/60) టీమిండియా ఘోరంగా దెబ్బకొట్టారు. ఆమిర్‌ ధాటికి రోహిత్‌శర్మ (0), శిఖర్‌ ధావన్‌ (21), విరాట్‌కోహ్లీ (5) 33 పరుగులకే పెవిలియన్‌ చేరుకున్నారు.ఫలితంగా భారత్‌ 30.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది.

అంతకుముండు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేశారు. వారి బ్యాటింగ్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. పొడి పిచ్ పై స్పిన్నర్లు, పేపర్లు బౌలింగ్ చేసేందుకు నానా కష్టాలుపడ్డారు.కొన్ని తప్పిదాల కారణంగా భారత్ భారీ స్కోర్ సమర్పించుకోవాల్సి వచ్చింది. నాలుగో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ ఫఖర్ జమాన్ అవుటైనా నోబాల్ కారణంగా ఆటను కొనసాగించాడు. అప్పటికి ఫఖర్ డబుల్ డిజిట్ రన్స్ కూడా చేయలేదు.ఇక లైఫ్ రావడంతో అతను రెచ్చిపోయి ఆడాడు.చెలరేగిఆడి సెంచరీ చేశాడు. మొత్తం 106 బంతులు ఎదుర్కొన్న ఫఖర్ 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 రన్స్ చేశాడు.

మరో ఓపెనర్ అజర్ అలీ 59 పరుగులు.. బాబర్ ఆజం 46.. షోయబ్ మాలిక్ 12 చేశారు. చివరిగా మొహమ్మద్ హఫీజ్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 రన్స్ చేసి స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించాడు. ఇమాద్ వాసిమ్ 25 రన్స్ చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో పాక్ 4 వికెట్ల నష్టానికి 338 రన్స్ చేసింది. భారత బౌలర్లలో భవనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →