Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

If you have guts then get ready for CBI inquiry: VijaySaiReddy

By   /  April 4, 2018  /  Comments Off on If you have guts then get ready for CBI inquiry: VijaySaiReddy

    Print       Email

ద‌మ్ముంటే సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌మ‌వ్వాలి

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* చంద్ర‌బాబుకు విజ‌య‌సాయిరెడ్డి స‌వాల్‌

* కేసుల భ‌యంతోనే ఢిల్లీకి వ‌చ్చిన బాబు

* ఏపీకి హోదా రావాల‌ని బాబుకు లేదు

* హోదా వ‌చ్చే వ‌ర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంద‌న్న సాయిరెడ్డి

డెక్క‌న్ అబ్రాడ్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ, చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పార్ల‌మెంట్ ప్రారంభ‌మైన నాటి నుంచి చంద్ర‌బాబుపై దూకుడు పెంచారు. దీంతో విమర్శలు ప్రతివిమర్శలతో ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిప్పుగారు ఢిల్లీకి వచ్చారని కానీ పప్పుగారు వచ్చారో లేదో తెలియదని చంద్రబాబు, లోకేష్‌లను ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వచ్చి కలుస్తారని, అందుకు అనుమత్వివాలని టీడీపీ ఎంపీలు ప్రతిపక్ష నేతల దగ్గరకెళ్లి బతిమిలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ నేతల చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాము ఫొటోలు తీస్తామని భయంతోనే కాళ్లు పట్టుకోవడం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. జాతీయ నేతలపై చంద్రబాబు రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు వేయించారని.. అప్పటి ఘటనలను జాతీయ నాయకులెవరూ మర్చిపోలేదని విజయసాయిరెడ్డి చెప్పారు.

టీడీపీ చిత్తశుద్ధి లేని పార్టీ అని.. వైసీపీ తరపున గెలిచిన 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారని విమర్శించారు. చంద్ర‌బాబు, లోకేష్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై బాబు వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. పెద‌బాబు, చిన‌బాబు వేల కోట్లు దోచుకుంటున్నార‌న్నారు.  బాబు నిజంగానే నిప్పు అయితే త‌న‌పై వ‌స్తున్న వారోప‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణ వేయించుకోవాల‌న్నారు. బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న కూడా కేంద్రం త‌న అవినీతిపై విచార‌ణ వేయ‌కుండా లాబీయింగ్ చేసుకోవ‌డాన‌కే వ‌చ్చారు త‌ప్పితే ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయ‌డానికి మాత్రం కాద‌ని దుయ్య‌బ‌ట్టారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →